Suicide: ఫ్యాన్ కి ఉరి వేసుకుంటే చనిపోకుండా ఉండేలా కొత్త ఆవిష్కరణ..

ప్రస్తుత కాలంలో సూసైడ్ అనేది ఒక అలవాటుగా మారిపోయింది. పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తే చాలు ఆత్మహత్యే దిక్కు అన్నట్లు రూంలో వెళ్లి తలుపులు బిగించి ఫ్యాన్ కి ఉరివేసుకొని చనిపోతుంటారు. మరి కొందరైతే ఫలితాలు రాకముందే ఎక్కడ ఫెయిల్ అవుతామో అన్న భయంతో సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి వాటికి తెరదించేందుకు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు.

  • Written By:
  • Updated On - August 19, 2023 / 10:52 AM IST

రాజస్థాన్ అనగానే మనకు గుర్తుకొచ్చే అంశం కోటలు, కట్టడాలు. ఇవి కాకుండా కోచింగ్ సెంటర్లకు పెట్టింది పేరు. ఐఐటీ, జేఈఈ, నీట్ లాంటి అనేక పోటీ పరీక్షల కోచింగ్ కోసం దేశం నలుమూలల నుంచి కోట ప్రాంతానికి వస్తూ ఉంటారు. ఈమధ్య కాలంలో కోచింగ్ తీసుకొని ర్యాంకు రాకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు చాలా మంది విద్యార్థులు. అలా చనిపోయిన వారిలో ఫ్యాన్ కి ఉరి వేసుకుని చనిపోయిన వారి శాతం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఇది ఆ రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో అక్కడి ప్రభుత్వ యంత్రాంగం, జిల్లా కలెక్టర్ అప్రమత్తమయ్యారు. స్థానికంగా ఉండే పేయింగ్ గెస్ట్ హాస్టల్స్, అద్దె గదులు, కోచింగ్ సెంటర్లలో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను ఏర్పాటు చేయాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.

దీనికి కారణం ఈ ఫ్యాన్లకు ఉరి వేసుకోవాలని ప్రయత్నించినా అవి బరువుకు నేలకు జారిపోతాయి. దీంతో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తి నేలపై వేలాడుతాడు. తద్వారా ఆత్మహత్యలను కొంతమేర నివారించవచ్చు అని భావిస్తున్నారు. అలాగే కోచింగ్ సెంటర్లలో మౌళిక సదుపాయాలు కల్పించాలని మార్గదర్శకాలు జారీచేసింది. ప్రతి ఏటా 2 లక్షల మంది విద్యార్థులు అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారని ఇక్కడి కోచింగ్ సెంటర్ లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం స్పందనపై కొందరు సోషల్ మీడియా వేదికగా మంచి అభిప్రాయన్ని వ్యక్తం చేస్తుంటే మరి కొందరు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా ఇలాంటి సంస్కరణలు దేశఆ వ్యాప్తంగా అన్న రాష్ట్రాల్లో అమలు అయితే ఒక్కశాతం ఇలాంటి ఆత్మహత్యలను అయినా కాపాడిన వాళ్లమౌతాము అంటున్నారు కొందరు రాజకీయనాయకులు.

T.V.SRIKAR