సూర్య నటించిన ‘జై భీమ్’లో హీరో తప్ప ఎవరూ తెలీదు. పెద్ద పేరు లేని నటీనటులతో తీసి మెప్పించిన దర్శకుడు జ్ఞానవేల్. రజనీకాంత్ దగ్గరకొచ్చేసరికి మల్టీస్టారర్ మూవీని చేసేశాడు. ఇందులో నటించే స్టార్స్ అంతా హేమాహేమీలు.
జై భీమ్‌తో ప్రశంసలు అందుకున్న దర్శకుడు జ్ఞానవేల్ రజనీకాంత్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. జైలర్ తర్వాత నటిస్తున్న ‘లాల్‌సలామ్’ షూటింగ్‌తోపాటు.. డబ్బింగ్ కూడా పూర్తి చేసిన రజనీ జ్ఞానవేల్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు. ఇది రజనీ కెరీర్‌లో 170వ సినిమా కాగా.. 171వ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకుడు. రజనీ, జ్ఞానవేల్ సినిమా మల్టీస్టారర్ మూవీగా రూపొందనుంది. ఇందులో యంగ్ హీరో రోల్‌కు ముందుగా నాని పేరు వినిపించింది. ఆతర్వాత శర్వానంద్ వచ్చేశాడు. చివరికి రానా పేరును టీం ప్రకటించి సస్పెన్స్‌కు తెర దించింది.
రజనీకాంత్, రానా సినిమాలో ముగ్గురు హీరోయిన్లు మంజు వారియర్.. రితికా సింగ్, దుషారా విజయన్ నటిస్తున్నటు నిర్మాత ఆల్రెడీ ఎనౌన్స్ చేశారు. బాలీవుడ్ నుంచి అమితాబ్.. మలయాళం నుంచి ఫహాద్ ఫాజిల్‌ను తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలను నిజం చేస్తూ.. పోస్టర్స్ రిలీజ్‌చేశారు. ఇలా.. రజనీ 170వ సినిమా ఔట్ అండ్ ఔట్ మల్టీస్టారర్ మూవీగా మారిపోయింది.
విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్న’లాల్ సలామ్’లోకి రజనీ రాకతో క్రేజీ ప్రాజెక్ట్ అయింది. జైలర్ మాదిరి రజనీ మరోసారి మల్టీస్టారర్ కథనే ఎంచుకున్నాడు. శివరాజ్‌కుమార్, మోహల్‌లాల్ గెస్ట్ అపీరియన్స్ జైలర్‌కు కలిసొచ్చింది. అమితాబ్.. ఫహాద్ ఫాజిల్.. రానా రాకతో రజనీ 170వ సినిమా పెద్ద సినిమాగా మారిపోయింది.