TDP NO RAJYASABHA : రాజ్యసభ సీటుకో దండం.. బరిలో నుంచి టీడీపీ జంప్‌..

ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరమవుతోంది. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయొద్దని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయించారు. తమ పార్టీకి బలం లేకపోగా... వైసీపీ రెబల్స్ పై ఆశలు పెట్టుకొని పోటీకి దిగడం కరెక్ట్ కాదన్నారు చంద్రబాబు. నామినేషన్లకు గురువారం చివరి తేదీ. దాంతో రాజ్యసభ ఎన్నికల్లో దిగడంపై కొందరు లీడర్లు బాబును కలిశారు.

 

 

 

ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరమవుతోంది. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయొద్దని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయించారు. తమ పార్టీకి బలం లేకపోగా… వైసీపీ రెబల్స్ పై ఆశలు పెట్టుకొని పోటీకి దిగడం కరెక్ట్ కాదన్నారు చంద్రబాబు. నామినేషన్లకు గురువారం చివరి తేదీ. దాంతో రాజ్యసభ ఎన్నికల్లో దిగడంపై కొందరు లీడర్లు బాబును కలిశారు. ఆ సంగతి పక్కన పెట్టాలనీ… వచ్చే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల మీద దృష్టిపెట్టాలని పార్టీ నాయకులకు సూచించారు చంద్రబాబు.

ఏపీలో మూడు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ముగ్గురు అభ్యర్థుల పేర్లు వైసీపీ ఇప్పటికే ప్రకటించింది. టీడీపీకి అసెంబ్లీలో బలం లేకపోవడంతో ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. రాజ్యసభకు ఎన్నిక కావాలంటే 44 మంది ఓమ్మెల్యేల ఓట్లు అవసరం. ప్రస్తుతం టీడీపీకి 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. మరో 27 మంది అవసరమవుతారు. కానీ ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని బట్టి వైసీపీయే ఆ మూడు సీట్లు గెలుచుకుంటుంది. అందువల్ల తమకున్న బలంతో పోటీకి దిగినా ఉపయోగం లేదనుకున్నారు చంద్రబాబు. రాజ్యసభ ఎన్నికల కోసం టైమ్ వేస్ట్ చేసుకోవద్దని సూచించారు. రాబోయే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలపై దృష్టి పెట్టాలని లీడర్లకు చెప్పారు. వైసీపీలో సీట్లు రాని 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనీ… వాళ్ళంతా టీడీపీకి ఓటు వేస్తారని కొందరు లీడర్లు బాబు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈ ప్రతిపాదన తిరస్కరించిన ఆయన…. టీడీపీకి ఓటు వేసే ప్రతి వైసీపీ ఎమ్మెల్యేలకు మళ్లీ ఎన్నికల్లో సీట్ ఇవ్వాలి. కానీ ఆ గ్యారంటీ ఇవ్వలేమన్నారు చంద్రబాబు. వాళ్లని నమ్ముకుని రాజ్యసభ ఎన్నికల్లో దిగడం అనవసరమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రాజ్యసభలో టీడీపీకి ఒకే ఒక్క సభ్యుడు ఉన్నారు. ఆయన ఏప్రిల్ లో రిటైర్డ్ అవుతున్నారు. ఆ తర్వాత టీడీపీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. పార్టీ ఆవిర్భవించిన 41యేళ్ళల్లో రాజ్యసభలో సభ్యుడు లేకపోవడం ఇదే మొదటిసారి.