Global Star, Ram Charan : హైద‌రాబాద్‌ టీమ్‌ను కొన్న రామ్ చ‌ర‌ణ్..

గల్లీ క్రికెట‌ర్ల‌కు భ‌విష్యత్తును బంగారు మయంగా మార్చే అద్భుత కార్య‌క్ర‌మంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రాం చ‌రణ్ భాగ‌మ‌య్యాడు.. ISPL లీగ్‌లో భాగంగా హైద‌రాబాద్ టీమ్‌కు ఓన‌ర‌య్యాడు. దీంతో చెర్రీ ఫ్యాన్స్‌తో పాటు, క్రికెట్ ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు. మ‌రి ఆ విశేషాలేంటో చూసేద్దామా..?

గల్లీ క్రికెట‌ర్ల‌కు భ‌విష్యత్తును బంగారు మయంగా మార్చే అద్భుత కార్య‌క్ర‌మంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రాం చ‌రణ్ భాగ‌మ‌య్యాడు.. ISPL లీగ్‌లో భాగంగా హైద‌రాబాద్ టీమ్‌కు ఓన‌ర‌య్యాడు. దీంతో చెర్రీ ఫ్యాన్స్‌తో పాటు, క్రికెట్ ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు. మ‌రి ఆ విశేషాలేంటో చూసేద్దామా..?

క్రికెట్‌ను అమితంగా ప్రేమించే భార‌త్‌లో మ‌రో కొత్త లీగ్ సంద‌డి చేయ‌నుంది. ఇప్ప‌టికే ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌, ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్ స‌హా ప‌లు స్థానిక లీగ్‌లు అభిమానుల‌ను అల‌రిస్తుండ‌గా.. ఇప్పుడు కొత్త‌గా ఇండియ‌న్ స్ట్రీట్ ప్రీమియ‌ర్ లీగ్ ఐఎస్‌పీఎల్ పేరుతో మ‌రో కొత్త లీగ్ సంద‌డి చేయ‌నుంది. గ‌ల్లీ క్రికెటర్లతో జ‌గ‌ర‌నున్న ఈ లీగ్‌పై మెగా ప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ కూడా భాగ‌మ‌య్యాడు. ఈ కొత్త లీగ్‌పై ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు ఆస‌క్తి చూపిస్తుండ‌గా.. హైద‌రాబాద్ టీమ్‌ను చెర్రీ కొనుగోలు చేశాడు. ఇప్ప‌టికే బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ ముంబై జ‌ట్టును, హృతిక్ రోష‌న్ బెంగ‌ళూరు, అక్ష‌య్ కుమార్ శ్రీ‌న‌గ‌ర్ జ‌ట్ల‌ను కొన‌గా.. రాంచ‌ర‌ణ్ హైద‌రాబాద్ జ‌ట్టును కొనుగోలు చేయ‌డంతో ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు.

ఇక‌..తాను ISPL లీగ్ కోసం హైద‌రాబాద్ జట్టును కొన్న విష‌యాన్ని రామ్ చ‌ర‌ణ్ స్వ‌యంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. గ‌ల్లీ క్రికెట్ లీగ్ హైద‌రాబాద్ జ‌ట్టుకు య‌జ‌మాని అయినందుకు చాలా సంతోషంగా ఉందంటూ త‌న ఆనందాన్ని పంచుకున్నారు. ఐఎస్‌పీఎల్‌లో హైద‌రాబాద్ జ‌ట్టు జైత్ర‌యాత్ర కోసం, అంద‌మైన జ్ఞాప‌కాల్ని పోగు చేసుకునేందుకు నాతో చేతులు క‌ల‌పండి అంటూ మెగా ప‌వ‌ర్ స్టార్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. ఫ్యాన్స్ ఈ ట్వీట్‌కు రీ ట్వీట్ల‌తో సోష‌ల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

వ‌చ్చే ఏడాది గ‌ల్లీ క్రికెట‌ర్ల కోసం ISPLషూరూ కానుంది. అయితే.. ఐఎస్‌పీఎల్‌కు, మిగ‌తా లీగ్‌ల‌కు ఉన్న ప్ర‌ధాన తేడా ఏంటంటే ఆట‌కు ఉప‌యోగించే బాల్.. ISPLను భార‌త్‌లో గ‌ల్లీ క్రికెట్ ఆడే టెన్నిస్ బాల్‌తో ఆడించనుండటం విశేషం.. మార్చి 2 నుంచి 9 దాకా టీ-10 ఫార్మాట్‌లో నిర్వ‌హించ‌నున్నఈ లీగ్‌లో ఆరు జ‌ట్లు పాల్గొంటాయి. ఆరు జ‌ట్లు ఏడు రోజుల పాటు 19 మ్యాచ్‌లు ఆడ‌నున్నాయి. ఐపీఎల్‌లో మాదిరిగానే ఈ లీగ్‌లో కూడా ఫ్రాంచైజీలు త‌మ ఆట‌గాళ్ల‌ను బ‌రిలోకి దింపుతాయి. ఆరు ఫ్రాంచైజీల‌తో తొలి సీజ‌న్ జ‌ర‌గ‌నుంది.

మ‌హారాష్ట్ర నుంచి ముంబై, తెలంగాణ‌, ఏపీ నుంచి హైద‌రాబాద్, త‌మిళ‌నాడు నుంచి చెన్నై, వెస్ట్ బెంగాల్ నుంచి కోల్‌క‌త‌, క‌ర్ణాట‌క నుంచి బెంగ‌ళూరు, జమ్మూ క‌శ్మీర్ నుంచి శ్రీన‌గ‌ర్ ఫ్రాంచైజీలు ఈ లీగ్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి. ఒక్కో జట్టులో 16 మంది స‌భ్యులు ఉండ‌నున్న ఈ లీగ్‌లో వ‌చ్చేఏడాది ఫిబ్ర‌వ‌రి 24న ముంబై వేదిక‌గా వేలం జర‌గాల్సి ఉంది. గ‌ల్లీ క్రికెట‌ర్లను వెలికితీసి వారిని భావి క్రికెట‌ర్లుగా రూపొందించే ప్ర‌క్రియ‌లో భాగంగా చేప‌ట్టిన ఈ లీగ్‌పై ఇప్ప‌టికే స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది.