GAME CHANGER: గేమ్‌ ఛేంజర్‌ రిలీజ్‌ అంత సీక్రెట్‌ ఎందుకో..?

గేమ్‌ ఛేంజర్‌ రిలీజ్‌ ఎప్పుడు అని ప్రొడ్యూసర్‌ను అడిగితే.. అది డైరెక్టర్‌ చేతుల్లో వుందని ఆమధ్య తప్పించుకున్నాడు. యానిమల్‌ ప్రెస్‌ మీట్‌లో మరోసారి ఇదే టాపిక్‌ వస్తే.. ఆయన్నుంచి సమాధానం రాలేదు. గేమ్‌ ఛేంజర్‌ రిలీజ్‌ ఎప్పుడో ఎవరూ చెప్పలేకపోతున్నాడు.

  • Written By:
  • Updated On - December 5, 2023 / 03:01 PM IST

GAME CHANGER: దేవర షూటింగ్‌ మొదలైన నెలకే ఏప్రిల్‌5న రిలీజ్‌ అంటూ ప్రకటించారు. పుష్ప2 ఆగస్ట్‌ 15న వస్తోందని ఎనౌన్స్‌ చేశారు. మరి 80 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకున్న గేమ్‌ ఛేంజర్‌ రిలీజ్ ఎప్పుడో ఎందుకు చెప్పడం లేదు. రామచరణ్‌, శంకర్‌ కాంబోలో దిల్‌ రాజు నిర్మిస్తున్న గేమ్‌ ఛేంజర్‌ 15 రోజుల మైసూర్‌ షెడ్యూల్‌ సోమవారంతో పూర్తయింది. ఈ సందర్భంగా చెర్రీ అక్కడే వున్న చాముండేశ్వరి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నాడు.

SALAAR: డార్లింగ్‌ ఎక్కువగా కనిపించడా.. సలార్‌లో ప్రభాస్‌ రోల్‌ తగ్గించారా..?

దీనికి సంబంధించిన వీడియో నెట్‌లో వైరల్‌ అయింది. గేమ్‌ ఛేంజర్‌ రిలీజ్‌ ఎప్పుడు అని ప్రొడ్యూసర్‌ను అడిగితే.. అది డైరెక్టర్‌ చేతుల్లో వుందని ఆమధ్య తప్పించుకున్నాడు. యానిమల్‌ ప్రెస్‌ మీట్‌లో మరోసారి ఇదే టాపిక్‌ వస్తే.. ఆయన్నుంచి సమాధానం రాలేదు. గేమ్‌ ఛేంజర్‌ రిలీజ్‌ ఎప్పుడో ఎవరూ చెప్పలేకపోతున్నాడు. 80 శాతం షూటింగ్‌ పూర్తయినా.. 2024లో వస్తుందని గ్యారెంటీగా చెప్పలేకపోతున్నారు. 2025 సంక్రాంతికి వస్తుందన్న ప్రచారం జరగుతోంది.

మిగిలి వున్న 20 శాతం షూటింగ్‌.. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కోసం ఏడాది తీసుకుంటారా..? అన్న డౌట్‌ వస్తోంది. శంకర్‌ సినిమా అంటే.. విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఓ లెవెల్లో వుంటాయి. ఇవన్నీ ఎప్పుడు పూర్తవుతాయోనని ఒక క్లారిటీ వస్తేగానీ.. రిలీజ్‌ డేట్‌ ప్రకటించరన్న మాట.