One Nation, One Election: దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు (జమిలి) నిర్వహించాలని కేంద్రం భావిస్తున్న సంగతి తెలిసిందే. వన్ నేషన్-వన్ ఎలక్షన్ పేరుతో ఈ ప్రతిపాదనకు బీజేపీ తెరతీసింది. గతంలో ఉన్న విధానాన్ని తిరిగి అమలు చేయాలని ప్రయత్నిస్తోంది. దీనికోసం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. తాజాగా ఈ కమిటీ.. తన నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందించారు. అందులోని కీలకాంశాలివి.
OTT platforms: ఓటీటీలకు కేంద్రం షాక్.. అశ్లీల కంటెంట్ ఉన్న 18 ఓటీటీలపై నిషేధం
‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ విధానం ప్రకారం.. దేశంలో గతంలో ఉన్న వన్ టైమ్ ఎలక్ష్సన్స్ పునరుద్ధరించాలి. ఈ అవసరాన్ని కమిటీ సూచించింది. లోక్‌సభతో పాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి. దీనికోసం దేశవ్యాప్తంగా, దశలవారీగా ఎన్నికలు నిర్వహించాలి. దేశానికి స్వాతంత్య్రం ఏర్పడ్డ తొలినాళ్లలో ఇలా ఒకేసారి ఎన్నికలు జరిగేవి. ఇలా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల అభివృద్ధితోపాటు సామాజిక ఐక్యతకు దోహదం చేస్తుంది. దేశంలో వేర్వేరు రాష్ట్రాల్లో.. వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, వ్యాపారాలు, కార్మికులు, అభ్యర్థులు, కోర్టులు, పౌర సమాజంతోపాటు వివిధ భాగస్వామ్య పక్షాలపై భారం పడుతోంది. ఒకే దేశం, ఒకే ఎన్నికలు ద్వారా ఈ భారం తగ్గుతుంది. ఇది మొదటి దశ. ఇక.. రెండో దశలో.. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన వంద రోజుల్లోపు మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఎన్నికలు జరపాలి. అయితే, ఇలా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే పలు సమస్యలున్నాయి.
MUDRAGADA PADMANABHAM: పిఠాపురం నుంచి పవన్ పోటీ.. వైసీపీ ముద్రగడను దింపబోతోందా ?
వేర్వేరు సమయాల్లో ఉన్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ప్రభుత్వాల పదవీ కాలమే ప్రధాన సమస్య. అవసరమైతే ఒకసారి లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తరువాత తిరిగి మళ్లీ లోక్‌సభ ఎన్నికలు జరిగే వరకు.. అన్ని రాష్ట్రాల అసెంబ్లీల కాల పరిమితిని పొడగించాలి. అప్పటికే ఒకవేళ హంగ్ పార్లమెంట్ లేదా హంగ్ అసెంబ్లీ లేదా అవిశ్వాస తీర్మానం వంటి పరిస్థితులు ఉంటే.. కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకో్వడం కోసం ఐదేళ్లలో మిగిలిన కాలానికి తాజాగా ఎన్నికలు నిర్వహించాలి. అసెంబ్లీల విషయానికొస్తే.. కొత్తగా ఏర్పడిన లోక్‌సభ పదవీకాలం ముగిసేవరకు ఆయా ప్రభుత్వాలు కొనసాగుతాయి. ఒకవేళ ప్రభుత్వం ముందుగా రద్దైతే.. నిబంధనల ప్రకారం వ్యవహరించాలి. జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు చట్టబద్ధత కలిగిన విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసుకోవాలి. అంటే.. ఎన్నికలకు అవసరమైన ఈవీఎంలు, వీవీప్యాట్‌లు, పోలింగ్, భద్రతా సిబ్బంది వంటి ఏర్పాట్లు చేయాలి.
ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు రాష్ట్రాల ఎన్నికల కమిషన్లు ప్రణాళికలను రూపొందించుకోవాలి. ఈ విధానం అమల్లోకి తేవాలంటే ఆర్టికల్ 83 (పార్లమెంటు కాలవ్యవధి), ఆర్టికల్ 172 (రాష్ట్రాల అసెంబ్లీల గడువుకు సంబంధించిన) చట్టాల రాజ్యాంగ సవరణ చేయాలి. మున్సిపాలిటీ, పంచాయతీలకు ఏకకాల ఎన్నికల కోసం ఆర్టికల్ 324ఏ, ఓటర్ల జాబితా, గుర్తింపుకార్డుల కోసం ఆర్టికల్ 325ను సవరించాలి. దీనికి రాష్ట్రాల ఆమోదం అవసరం.