Ramoji Rao : రామోజీరావు అంతిమయాత్ర.. రామోజీరావు పాడె మోసిన చంద్రబాబు

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం ఉదయం జరగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఫిలింసిటీలోని స్మృతివనంలో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం ఉదయం జరగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఫిలింసిటీలోని స్మృతివనంలో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆదేశాలను సీఎస్ శాంతి కుమారి జారీచేశారు. పలువురు సీఎంలు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు హాజరవుతున్నందున పటిష్ఠ భద్రత కల్పించాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. కాగా రామోజీ రావు అంత్యక్రియలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రంగారెడ్డి కలెక్టర్ శశాంక, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వం నుంచి ముగ్గురు అధికారులు పాల్గొననున్నారు. సీనియర్ IAS అధికారులు సాయిప్రసాద్, ఆర్పీ సిసోడియా, రజత్ భారత్‌లు పాల్గొని రామోజీరావుకు నివాళి అర్పిస్తారు. కాగా రామోజీరావు మృతికి సంతాపంగా ఆంధ్రప్రదేశ్‌లో 9, 10 తేదీల్లో సంతాప దినాలుగా.. సెలవుదినంగా ప్రకటింది.

ఈరోజు ఉదయం రామోజీరావు నివాసం నుంచి ఆయన పార్ధివదేహంతో అంతిమయాత్ర మొదలైంది. అమెరికా నుంచి వచ్చిన రామోజీరావు మనవడు సంజయ్, కుటుంబ సభ్యులు కడసారి వీడ్కోలు పలికారు. అంతిమయాత్ర వాహనంపై కుటుంబ సభ్యులతోపాటు తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఏపీ బీజేపీ ఎమ్మెల్యే సృజనా చౌదరి, జస్టిస్ ఎన్వీ రమణ, పలువురు ప్రముఖులు ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అంతిమయాత్రలో పాల్లొని రామోజీ పార్దివదేహం పాడె మోశారు. ఇక చివరు చూపుగా ఈనాడు గ్రూప్ సంస్థల ఉద్యోగులు, సిబ్బంది ఆయన పార్దీవ దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు.

దేశ వ్యాప్తంగా రాష్ట్రపతి ద్రౌపది, ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, నారా లోకేశ్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ మంత్రి కేటీఆర్ సహా ఇతర ప్రముఖులు రామోజీ రావు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.