రాణా ఔట్..ప్రసిద్ధ కృష్ణ ఇన్, మూడో టెస్టుకు తుది జట్టు ఇదే

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రసవత్తరంగా సాగుతోంది.. పెర్త్ టెస్టులో భారత్ అదరగొట్టి కంగారూలను చిత్తు చేస్తే... ఆతిథ్య జట్టు పింక్ బాల్ టెస్టులో బౌన్స్ బ్యాక్ అయింది. పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ అడిలైడ్ లో రివేంజ్ తీర్చుకుంది. దీంతో సిరీస్ లో ఇరు జట్లు 1-1-1తో సమంగా ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - December 10, 2024 / 08:31 PM IST

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రసవత్తరంగా సాగుతోంది.. పెర్త్ టెస్టులో భారత్ అదరగొట్టి కంగారూలను చిత్తు చేస్తే… ఆతిథ్య జట్టు పింక్ బాల్ టెస్టులో బౌన్స్ బ్యాక్ అయింది. పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ అడిలైడ్ లో రివేంజ్ తీర్చుకుంది. దీంతో సిరీస్ లో ఇరు జట్లు 1-1-1తో సమంగా ఉన్నాయి. ఇప్పుడు మూడో టెస్ట్ కోసం టీమిండియా రెడీ అవుతోంది. డిసెంబర్ 14 నుంచి గబ్బా వేదికగా ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. రెండో టెస్ట్ ఓటమితో ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో మార్పులు జరగనున్నాయి. బౌలింగ్ విభాగంలో హర్షిత్ రాణాపై వేటు పడనుంది. పెర్త్ టెస్టులో సత్తా చాటిన రాణా పింక్ బాల్ తో మాత్రం తేలిపోయాడు. దీంతో అతని స్థానంలో ప్రసిద్ధ కృష్ణ జట్టులోకి రానున్నాడు. ప్రసిధ్ బంతితో పాటు కీలక పరుగులు చేసే సామర్థ్యం ఉండటంతో అతన్ని తుదిజట్టులోకి తీసుకోవాలని మేనేజ్మెంట్ యోచిస్తోంది. అంతేగాక ఆస్ట్రేలియా-ఏతో జరిగిన మ్యాచ్‌ల్లో ప్రసిధ్ 10 వికెట్లతో సత్తాచాటాడు.

గత రికార్డు పరంగా ప్రసిద్ధ కృష్ణ వైపే మేనేజ్ మెంట్ మొగ్గుచూపుతున్నా… ఆకాశ దీప్ పేరు కూడా పరిశీలనలో ఉంది. దీంతో బూమ్రా, సిరాజ్ లకు తోడు మూడో పేసర్ గా వీరిద్దరిలో ఒకరు జట్టులోకి రానున్నారు. అలాగే స్పిన్నర్ అశ్విన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ ఫైనల్ ఎలెవన్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాటింగ్ డెప్త్ కోసమే సుందర్ ను ఆడిస్తారన్న అంచనాలున్నాయి. అదే సమయంలో సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రేసులో ఉండడంతో తుది జట్టులో ఎవరికి చోటు దక్కుతుందనేది చూడాలి. మిగిలిన ఆటగాళ్ళలో మార్పులు జరిగే అవకాశాలు లేనట్టే… అయితే ఓపెనర్ గా మరోసారి కెఎల్ రాహుల్ కే ఛాన్స్ దక్కనుంది. గత మ్యాచ్ లో నిరాశపరిచినప్పటకీ జైశ్వాల్, రాహుల్ కాంబినేషన్ ను విడదీయకూడదని టీమిండియా మేనేజ్ మెంట్ భావిస్తోంది. దీంతో రోహిత్ మూడో టెస్టులోనూ మిడిలార్డర్ లోనే ఆడనున్నాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్ కొనసాగించనున్న హిట్ మ్యాన్ ఈ మ్యాచ్ తోనైనా ఫామ్ లోకి రావాలని భారత్ కోరుకుంటోంది.