మాస్ మహారాజా రవితేజా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు… ఎట్టకేలకు రవితేజా తన తర్వాతి ప్రాజెక్ట్ షూట్ కోసం రెడీ అయ్యారు. రెండు నెలల క్రితం ఆయనకు ఒక యాక్సిడెంట్ అయిందని, అప్పుడు రవితేజాకు తీవ్ర గాయాలు అయ్యాయి అని ఏడాది పాటు ఆయన సినిమా షూట్ లో పాల్గొనే ఛాన్స్ లేదని ప్రచారం జరిగింది. రవితేజా హాస్పిటల్ లో ఉన్న ఓ ఫోటో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ ఫోటోను చూసిన ఫ్యాన్స్ అయితే పూజలు కూడా చేసి… మాస్ మహారాజా త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్ధించారు.
అయితే తనకు అంత సీరియస్ ఏం కాదని చిన్న గాయానికి పెద్ద చికిత్స అవసరమైనదని… అనవసరంగా భయపడవద్దని రవితేజా ఫ్యాన్స్ ను కోరిన సంగతి తెలిసిందే. వరుసగా సినిమాలు చేస్తున్న రవితేజా రిజల్ట్ గురించి కూడా పెద్దగా ఆలోచించడం లేదు. ఇటీవల ఆయన నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. బాలీవుడ్ రీమేక్ ను నాశనం చేసారు అనే కామెంట్స్ వచ్చాయి. హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఆ సినిమాపై హైప్ కూడా భారీగా క్రియేట్ అయిన సంగతి తెలిసిందే.
అయితే ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఆ సినిమాను నాశనం చేసాడని హరీష్ పై రవితేజా ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఇక రవితేజా కూడా డబ్బుల కోసం సినిమాలు చేస్తున్నాడు గాని కథలు కూడా సరిగా వినడం లేదని… అసలు ఆయన యాక్షన్ లో విలక్షణం అనే పదం మిస్ అయిందని కామెంట్స్ వచ్చాయి. ఇక చివరకు రవితేజా సినిమా షూట్ కోసం రెడీ అయ్యారు. హైదరాబాద్ లోనే ఆయన నటిస్తున్న సినిమా షూట్ ను ప్లాన్ చేసారు. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా భాను భోగవరపు డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు.
శ్రీ లీల హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో రవితేజా… ఆర్పీఎఫ్ ఆఫీసర్ గా పవర్ ఫుల్ రోల్ లో చేస్తున్నారట. యాక్షన్ చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో ఆయన పాత్ర పేరు లక్ష్మణ్ భేరి అని టాక్. ఈ సినిమాతో తన కొడుకుని కూడా టాలీవుడ్ కు పరిచయం చేసే ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇప్పుడే కాస్త గాయం నుంచి కోలుకుంటున్న రవితేజా… వేరే ప్రాంతాలకు వెళ్ళకుండా… దగ్గరలోనే షూట్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెల్లిపోయేలా చూస్తున్నారట. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది.