Ravichandran Ashwin: అలుపులేని అశ్విన్ బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలు

టీమిండియా బౌలింగ్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం బ్యాటింగ్ పై దృష్టి పెడుతున్నాడు.

  • Written By:
  • Publish Date - September 24, 2023 / 09:40 AM IST

టీమిండియా బౌలింగ్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం బ్యాటింగ్ పై దృష్టి పెడుతున్నాడు. అక్షర్ పటేల్ గాయంతో అనూహ్యంగా వరల్డ్ కప్ లో రేస్ లోకి వచ్చిన ఈ సీనియర్ ఆఫ్ స్పిన్నర్.. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకుంటున్నాడు. బౌలింగ్ లో తిరుగు లేని అశ్విన్ ఇప్పుడు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాడు. ఇంతకీ అశ్విన్ కి బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో అని సందేహపడుతున్నారా..? స్వదేశంలో వరల్డ్ కప్ జరుగుతుండడంతో ఈ సారి స్పినర్లకి ఎక్కువగా అవకాశం కల్పిస్తారని అంతా భావించారు. కానీ స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ కి మాత్రమే వరల్డ్ కప్ స్క్వాడ్ లో అవకాశం దక్కింది. మరో ఇద్దరు స్పిన్నర్లుగా అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలను ఎంపిక చేశారు.

అశ్విన్ అనుభవం, చాహల్ నాణ్యమైన స్పిన్ బలాన్ని కాకుండా బ్యాటింగ్ లో డెప్త్ ఉంటుందని అక్షర్ పటేల్ వైపు సెలక్టర్లు మొగ్గు చూపారు. అయితే అక్షర్ గాయపడడంతో టీమిండియాకు అశ్విన్ తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించేలేదు. ఈ నేపథ్యంలో అక్షర్ పటేల్ ని రీప్లేస్ చేయాలంటే అశ్విన్ బ్యాటింగ్ లో కూడా రాణించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా నిన్న మొహాలీ వన్డే అనంతరం బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. అశ్విన్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడంలో పెద్దగా ఆశ్చర్యం లేకపోయినా మ్యాచ్ అయిపోయిన తర్వాత నైట్ టైంలో ప్రాక్టీస్ చేయడంతో నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నీ డెడికేషన్ కి ఫిదా అంటూ ఈ సీనియర్ స్పిన్నర్ ని ఆకాశానికెత్తేస్తున్నారు. మరికొందరైతే అక్షర్ గాయ నుంచి కోలుకున్నా.. అతనికి వరల్డ్ కప్ లో స్క్వాడ్ లో చోటు దక్కదని కామెంట్ చేస్తన్నారు.