Ambati Rayudu : పాక్ పై రఫ్ఫాడించిన రాయుడు.. భారత్ దే లెజెండ్స్ ట్రోఫీ

చిరకాల ప్రత్యర్థుల పోరులో మరోసారి భారత్ దే పై చేయిగా నిలిచింది. వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ ఫైనల్లో పాక్ ను చిత్తు చేసి టైటిల్ గెలుచుకుంది.

 

 

చిరకాల ప్రత్యర్థుల పోరులో మరోసారి భారత్ దే పై చేయిగా నిలిచింది. వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ ఫైనల్లో పాక్ ను చిత్తు చేసి టైటిల్ గెలుచుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ ను భారత బౌలర్లు కట్టడి చేశారు. టోర్నీ ఆరంభం నుంచీ భారీస్కోర్లు సాధిస్తున్న పాక్ ను 156 పరుగులకే పరిమితం చేశారు. ఛేజింగ్ లో రాబిన్ ఊతప్ప, సురేశ్ రైనా త్వరగానే ఔటైనప్పటకీ… అంబటి రాయుడు కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మెరుపు హాఫ్ సెంచరీతో జట్టును విజయానికి చేరువ చేశాడు. చివర్లో యూసఫ్ పఠాన్ మెరుపులు మెరిపించడంతో భారత్ లెజెండ్స్ 19.1 ఓవర్లలో టార్గెట్ ను ఛేదించింది. రాయుడుకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ , యూసఫ్ పఠాన్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.