Gold reserves: ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ ఆర్బీఐ మాత్రం బంగారాన్ని భారీ స్థాయిలో కొనుగోలు చేస్తోంది. గత జనవరిలోనే 8.7 టన్నుల బంగారాన్ని ఆర్‌బీఐ కొనుగోలు చేసింది. గతే రెండేళ్లలో ఈస్థాయిలో బంగారం కొనడం ఇదే తొలిసారి. ఇటీవల రెండేళ్లలో ఎప్పుడూ లేని విధంగా బంగారం కొనుగోలు చేస్తోంది. విదేశీ మారక నిల్వల్ని పెంచుకునే ఉద్దేశంతోనే ఆర్బీఐ బంగారం కొనుగోలు చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు.
KAVITHA: లిక్కర్ స్కాంలో కవితకు షాక్.. తిహార్ జైలులో విచారించనున్న సీబీఐ
మార్చి 2023 నాటికి ఆర్బీఐ వద్ద ఉన్న విదేశీ మారక నిల్వల్లో 51.487 బిలియన్ డాలర్ల విలువైన బంగారం ఉంది. మార్చి 2022 నాటికి ఉన్న విలువతో పోలిస్తే 6.287 బిలియన్ డాలర్లు అధికం. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం.. ఈ జనవరి చివరి నాటికి ఆర్‌బీఐ దగ్గర ఉన్న బంగారు నిల్వలు 812.3 టన్నులు. దీన్ని కేజీల్లోకి మారిస్తే.. 8 లక్షల 12 వేల కిలోలు. అంతకుముందు నెలలో.. అంటే గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఇవి 803.58 టన్నులుగా ఉన్నాయి. దాదాపు 9 టన్నుల బంగారం నిల్వలు పెరిగాయి. విదేశీ మారక నిల్వలు పెరగాలంటే బంగారం కొనాల్సిందే. అందుకోసమే భారీగా బంగారాన్ని కొంటున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. అయితే, ఎంత బంగారం కొంటున్నారో ఆయన వెల్లడించలేదు. పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను శక్తికాంత దాస్ మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. దేశంలో విదేశీ మారక నిల్వలు ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.
మార్చి 29 నాటికి ఫారెక్స్ నిల్వలు 645.6 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. భవిష్యత్తులో డాలర్ కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తే.. అటువంటి ప్రమాదాలను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులోభాగంగా విదేశీ మారక నిల్వలు పెంచడంపై గత నాలుగైదేళ్లుగా దృష్టి కేంద్రీకరించారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను రానున్న రోజుల్లో తగ్గిస్తామని సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలోనే బంగారం రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి.