Glenn Maxwell: బెంగళూరుకు షాక్.. సీజన్ నుంచి తప్పుకున్న మాక్స్‌వెల్

ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లల్లో జట్టు అంచనాలు, గేమ్ ప్లాన్‌కు అనుగుణంగా ఆడలేకపోయానని అంగీకరించాడు.మానసికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోన్నానని, ఐపీఎల్ సీజన్ నుంచి బ్రేక్ తీసుకోవాలని భావిస్తోన్నానని తెలిపాడు.

  • Written By:
  • Publish Date - April 16, 2024 / 05:52 PM IST

Glenn Maxwell: ఐపీఎల్ 17వ సీజన్‌లో వరుస పరాజయాలతో సతమతం అవుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ మాక్స్‌వెల్ ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని మ్యాక్స్‌వెల్ స్వయంగా వెల్లడించాడు. ఈ సీజన్‌లో తాను ఆశించిన స్థాయిలో ఆడట్లేదని, కొంత విరామం కావాలని మేనేజ్‌మెంట్‌ను కోరానని వివరించాడు. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లల్లో జట్టు అంచనాలు, గేమ్ ప్లాన్‌కు అనుగుణంగా ఆడలేకపోయానని అంగీకరించాడు.

Thota Trimurthulu: శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుకు జైలు శిక్ష.. 1996 నాటి కేసులో తీర్పు

మానసికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోన్నానని, ఐపీఎల్ సీజన్ నుంచి బ్రేక్ తీసుకోవాలని భావిస్తోన్నానని తెలిపాడు. శారీరకంగా, మానసికంగా విరామం తీసుకోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తోన్నానని పేర్కొన్నాడు. తనను తుది జట్టులో తీసుకోకపోవడానికి కారణాలను వెదుక్కోనక్కర్లేదని వ్యాఖ్యానించాడు. కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ గేమ్‌కు అతను దూరం అయ్యాడు. స్వచ్ఛందంగా ఈ మ్యాచ్ నుంచి తప్పుకొన్నాడు. తుదిజట్టును ఎంపిక చేయడానికి కొద్దిసేపటి ముందు ఈ విషయాన్ని కేప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌కు తెలియజేశాడు. తనకు బదులుగా మరొకరిని ప్లేయింగ్ 11కు సెలెక్ట్ చేయాలని కోరాడు. ఇప్పుడు సీజన్ మొత్తం నుంచీ వైదొలిగాడు.

ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లను ఆడాడు మ్యాక్స్‌వెల్. 32 పరుగుల మాత్రమే చేయగలిగాడు. అటు బౌలర్ గా కూడా నిరాశ పరిచాడు. ఇక ఇప్పటివరకు ఏడు మ్యాచ్ లు ఆడిన బెంగుళూరు ఆరింటిలో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది.