ఐపీఎల్ మెగావేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ సపోర్టింగ్ స్టాఫ్ పై ఫోకస్ పెట్టింది. తమ బౌలింగ్ కోచ్‌గా ముంబై రంజీ టీమ్ హెడ్ కోచ్ ఓంకార్ సాల్విని నియమించిందిదేశవాళీ క్రికెట్ సీజన్ ముగిసిన తర్వాత ఆర్‌సీబీ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఓంకార్ సాల్వీకి ఆటగాడిగా పెద్దగా అనుభవం లేదు. అతను 2005లో రైల్వేస్ తరఫున ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు.అయితే కోచ్ గా మంచి గుర్తింపు పొందాడు. రంజీ ట్రోఫీ 2023-24కు ముందే ఓంకార్ సాల్వి ముంబై హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అతని పర్యవేక్షణలో అసాధారణ ప్రదర్శన కనబర్చిన ముంబై.. రంజీ ట్రోఫీ విజేతగా నిలిచింది. అలాగే ప్రతిష్టాత్మక ఇరానీ కప్‌ను కూడా ముంబై గెలుచుకుంది. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ముంబై ఇరానీ కప్‌ను ముద్దాడింది. ఈ రెండు విజయాలతో ఓంకార్ సాల్వి పేరు వెలుగులోకి వచ్చింది.