సలార్ మూవీ ఈనెల 28 కి రావాలి. కాని గ్రాఫిక్స్ వర్క్ లేటవటంతో ఫిల్మ్ టీం డిసెంబర్ కి వాయిదా వేసిందంటున్నారు. ఎప్పుడు వస్తుందో తెల్చలేదు కాని డిసెంబర్ కి వాయిదా అంటూ పుకార్లుమాత్రం పెరిగాయి. అవన్నీ అటుంచితే, ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ పూర్తవటానికి 40రోజులు కావలట. అంటే దసరాకు సలార్ ని రంగంలోకి దింపే ఛాన్స్ ఉంది.
కాని ఆ పనిచేస్తారా? చేస్తే ఆల్రెడీ ముహుర్తాలు చూసుకున్న సినిమాల పరిస్థితేంటి? ఇలాంట డౌట్లే ఇండస్ట్రీ జనాన్ని ఇరిటేట్ చేస్తున్నాయి.దసరాకు బాలయ్యమూవీ భగవంత్ కేసరి, రవితేజ మూవీ టైగర్ నాగేశ్వర రావు రాబోతోంది. తమిళ లియో కూడా దసరాకే రాబోతోంది. దీపావలికి హిందీ సినిమాలు. క్రిస్మస్ కి పవన్ మూవీ తోపాటు రణ్ బీర్ కపూర్ తోసందీప్ రెడ్డి తీస్తున్న యానిమల్ మూవీ రాబోతోంది
సో ఇవన్నీ సలార్ మూవీ వాయిదా వల్ల డిస్ట్రబ్ అయ్యే ఛాన్స్ ఉంది. సలార్ సినిమాకు కూడా ఇది మంచింది కాదు. ఎందుకంటే, తెలుగు,తమిళ్,హిందీ భాషల్లో ఆల్రెడీ కొన్ని ముహుర్తాలకు సినిమాల రిలీజ్ లు పెట్టుకుంటే, ఆ టైంలో సలార్ ని రిలీజ్ చేయటం తలనొప్పే .ఎందుకంటే ఆ భాషల్లో వచ్చేమూవీలన్నీటితో సలార్ పోటీ పడితే వసూళ్ల మీద ప్రభావం చూపించొచ్చు..
ఇక సంక్రాంతి కి సరైన టైం అనుకుంటే అప్పుడు గుంటూరు కారం సీన్ లో ఉండబోతోంది. మార్చ్ కి పుష్ప 2, ఏప్రిల్ లో దేవర, ఇలా ప్రతీ నెల ఏదో ఒక మూవీ రిలీజ్ కాబోతోంది. సో ముందనుకున్న సలార్ రిలీజ్ డేట్ నిమార్చి, దసరా నుంచి సమ్మర్ వరకు ఏదో సీజన్ లో రిలీజ్ అంటే అప్పుడు విడుదల పెట్టుకున్న సినిమాల పరిస్థితేంటి? ఆ మూవీల హీరోలు, నిర్మాతలు ఊరుకుంటారా? ఇలా చాలా ప్రశ్నలు సమస్యలు సలార్ టీంని ఇబ్బందుల్లోకి నెడుతోంది. ప్రభాస్ కి ఎంత మార్కెట్ ఉన్నా సలార్ ఎంత క్రేజీ సినిమా అయినా ఇలాంటి లెక్కలు కూడా చూసుకోక తప్పదు…