ఏపీలో ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ లైన్స్ నిల్చోంటున్నారు.
పోలింగ్ శాతం కూడా పెరుగుతు వస్తుంది. కొన్ని కేంద్రాల్లో మాత్రం ఘర్షణ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటున్నాయి. మరి కొన్ని చోట్ల ఈవీఎంలు ద్వంసం చేశారు. ఇక ఏపీలో ఎక్కడ ఓటింగ్ ఎలా జరుగుతున్న అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ఒక్క కాకినాడ జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం మత్రమే అని చెప్పాలి. ఎందుకంటే..? ఇక్కడ పోటీ చేస్తుంది ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరి.. పవన్ గెలుపు కోసం మెగా హీరోలతో పాటుగా..జబర్ధస్త్ నటులు, సినీ నటులు, సీరియల్ యాక్టర్స్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సైతం కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో ఇక్కడ పవన్ గెలుపు కోసం టాలీవుడ్ మొత్తం కదిలి వచ్చినట్లు కనిపించింది. అక్కడ పవన్ గెలుపు పై రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా జనసేన పార్టీ తరఫున పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. పవన్ కు ప్రత్యర్థిగా వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉన్నారు.
కాగా ఇక్కడ ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఓ పోలింగ్ కేంద్రం వద్ద పరిశీలనకు వచ్చిన వంగా గీత ఓ వ్యక్తిపై మండిపడ్డారు. అతడు మెడలో ఎర్ర కండువా వేసుకుని రావడమే అందుకు కారణం.. అయితే, అతడు జనసేనకు మద్దతుగా ఆ ఎర్ర కండువా వేసుకొచ్చాడంటూ ఆమె తీవ్ర అభ్యంతరం చెప్పారు. వైసీపీ అభ్యర్థి వంగా గీత వెంటనే అతని కండువా తీసేయాలని సూచించారు. దానికి అతను ఇది కండువా కాదు.. కేవలం గుడ్డ మాత్రమేనంటూ సమాధానం ఇచ్చారు. అయితే, ఇది కాశీ రుమాలంటూ ఆ వ్యక్తి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వంగా గీతతో పాటు, అక్కడి ఎన్నికల సిబ్బంది కూడా అంగీకరించలేదు. అతడిని అక్కడ్నించి వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. దీంతో వంగా గీత కోపంతో ఊగిపోయింది. ఎర్ర కండువా తీసేయకపోతే తాము కూడా వైసీపీ కండువాలు మెడలో వేసుకుని పోలింగ్ కేంద్రానికి వస్తామని హెచ్చరించారు. కండువా తీసేయమని ఎంత చెప్పినా వినకపోవడంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి పంపించారు.
దీనిపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పందించారు.
ఎర్ర తువ్వాలును కాశీ తువ్వాలు అంటారని వెల్లడించారు. ఆ తువ్వాలను కష్టం చేసుకునే ప్రతి కార్మికుడు ధరించవచ్చని తెలిపారు. ఆ తువ్వాలును వేసుకునే హక్కు ఏ పౌరుడికైనా ఉంటుందని” నాగబాబు స్పష్టం చేశారు. ఆ తువ్వాలును అడ్డుకోవడం అనేది చట్ట వ్యతిరేకం అవుతుంది… ఆ తర్వాత మీ ఇష్టం” అంటూ వంగా గీతకు కౌంటర్ ఇచ్చారు.
మరో వైపు టీడీపీ ముఖ్యనాయకుడు సీని నటుడు హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందుపూరంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఇక్కడ ఈసీ ఆదేశాలకు విరుద్దంగా.. పోలింగ్ బూత్ వద్దకు మెడలో టీడీపీ కండువాలతో ఓటు వేసేందుకు వచ్చారు. ఇప్పుడు ఇదే తీవ్ర చర్చగా మారింది. నిజానికి పోలింగ్ బూత్ వద్దకు ఎవరు కూడా పార్టీ రంగులతో గానీ.. పార్టీ జెండాలతో గానీ వెళ్లి ఓటు వేయకూడదని ఆదేశాలు ఉన్నప్పటికీ వాటన్నిటిని నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ బేఖాతర్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది.
Suresh SSM