తెలంగాణ ఎన్నికల్లో 64 ఎమ్మెల్యేతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ఎంత త్వరగా ముగిసాయో లేదో.. ఇలా అసెంబ్లీ సమావేశాల్లో పాలక.. ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అసెంబ్లీలో సమావేశాలు మంచి జోరుగా రసవత్తరంగా జరుగుతున్నాయి. ఇక ప్రభుత్వం గత ప్రభుత్వం ఆర్ధిక, విద్యుత్ వంటి రంగాలపై శ్వేత పత్రం విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.
శనివారం (నేడు) ఉదయం తెలంగాణ భవన్ వేదికగా కేటీఆర్ గత తొమ్మిదిన్నరేళ్ల పాలనలో తెలంగాణ సాగించిన ప్రగతి ప్రస్థానం పేరిట పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు సిద్ధమని ప్రకటించారు. కాగా ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ.. కాంగ్రెస్ శ్వేత ప్రతం కు కౌంటర్ గా స్వేద పత్రం విడుదల చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఈరోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్,
స్వేద పత్రం విడుదల చేయనుండగా.. అనివారి కారణాల వల్ల ఆ కార్యక్రమం వాయిదా పడింది.
చివరి నిమిషంలో ఏం జరిగిందో తెలియదు.. ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఆదివారం ఆ కార్యక్రమం ఉంటుందని సమాచారం.. అయితే వాయిదాకి గల కారణం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. తెలంగాణలో బీఆర్‌ఎస్ పాలన సువర్ణ అధ్యాయమని.. దానికోసం తమ ప్రభుత్వం చిందించిన చెమటను ప్రజలకు వరించేందుకే ‘స్వేద పత్రం’పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నామని ట్వీటర్ వేదికగా మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ చెబుతున్నారు.
తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం
దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం
పగలూ రాత్రి తేడా లేకుండా..
రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన..
తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించం..
విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించం..
అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోం..
అందుకే గణాంకాలతో సహా..
వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరించేందుకు..
అప్పులు కాదు..
తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు..
“ స్వేద పత్రం ”
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్