కాంగ్రెస్ మూడో జాబితా (Congress Third List) విడుదలైంది. ఈ జాబితాతో కాంగ్రెస్ లో మంటలు రాజుకున్నాయి. పలు నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకటి.. రెండు సీట్లు అయితే పెద్దగా.. చర్చ లోకి రాదు కానీ దాదాపు 9 నియోజకవర్గాలు వనపర్తి, నారాయణఖేడ్, పటాన్ చెరు, చెన్నూరు, డోర్నకల్, పాలకుర్తి, తుంగతుర్తి, సంగారెడ్డి, బోథ్ లో కాంగ్రెస్ పాత అభ్యర్థులు ఆందోళనలు చేపడుతున్నారు. పార్టీ కోసం 9 సంవత్సరాలుగా కష్ట పడుతున్న తమకు కాదంటూ కొత్తగా చేరిన వారికి సీట్లు కేటాయించడంతో నాయకులు.. కార్యకర్తలు పార్టీ ముఖ్య శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు రోడ్డెక్కుతున్నారు.
TELANGANA CONGRESS: నీలం మధుకు టికెట్ ఇవ్వడంపై.. పటాన్‌చెరు కాంగ్రెస్‌లో మంటలు..
ఇక అసంతృప్తి చెందిన వారిలో కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) కూడా ఒకరు. కాంగ్రెస్ మూడో జాబితా పై దామోదర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. పటాన్ చెరువు..నారాయణఖేడ్ టికెట్స్ విషయంలో టికెట్స్ ను సురేష్ కుమార్, సంజీవరెడ్డి కేటాయించింది కాంగ్రెస్. ఈ జాబితా పై తీవ్ర అసంతృప్తితో దామోదర అభ్యంతరం తెలుపుతూ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. తన అనుచరులతో చర్చించిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తోంది.
దీంతో నేరుగా దామోదర రాజనర్సింహ కు కాంగ్రెస్ (Congress Party) నేత మాణిక్ రావు ఠాక్రే ఫోన్ చేసి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పినట్లు సమాచారం. దీని పై దామోదర్ ఆగ్రహంతో మీకు ఇష్టం వచ్చిన వారికి టికెట్లు ఇస్తే చూస్తూ ఉరుకోవాలా..? థాక్రేకు బదులిచిన్నట్లు సమాచారం. ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.
పటాన్ చెరులో కాంగ్రెస్ ఆందోళనలు..
కాంగ్రెస్ మూడో జాబితాలో పటాన్ చెరు టికెట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ కాకుండా ఇటీవల బీఆర్ఎస్ నుంచి పార్టీలో చేరిన నీలం మధు కు కేటాయించడంతో .. కాటా శ్రీనివాస్ గౌడ్ తీవ్ర అసంతృప్తి చెందారు.. గత తొమ్మిదేళ్లుగా పార్టీకి సేవలందిస్తున్న నాకు కాదని మధుకు టికెట్ ఎలా ఇస్తారు అని ప్రశ్నించారు. దీంతో నగరంలో ఉన్న రేవంత్ రెడ్డి పోస్టర్లు.. కాంగ్రెస్ బ్యానర్లను కాల్చేశారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద నిరసన తెలిపారు. కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులను నిరసన కారులకు పోలీసులు అరెస్ట్ చేశారు.
కాంగ్రెస్ 16 మంది అభ్యర్థుల మూడో జాబితా..
SURESH