Remal Cyclone : ముంచుకొస్తున్న “రెమాల్ తుఫాన్”… ఉప్పడ తీరంలో ఎగసిపడుతున్న అలలు…

కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంపై రెమాల్ తుఫాన్ ప్రభావంతో అలలు రక్షణ గోడపై నుంచి రోడ్డుపైకి దూసుకోస్తున్నాయి. ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారింది.

 

కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంపై రెమాల్ తుఫాన్ ప్రభావంతో అలలు రక్షణ గోడపై నుంచి రోడ్డుపైకి దూసుకోస్తున్నాయి. ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారింది. రక్షణ గోడ పైనుంచి రోడ్డుపైకి అలలు దూసుకొస్తున్నాయి. దీంతో, అధికారులు బీచ్ రోడ్డు రాకపోకలపై దృష్టి సారించారు. మాయపట్నం, ఉప్పాడ, సుబ్బంపేట, ఎస్పీజీఎల్ శివారు వరకు వువ్వెత్తిన అలలు ఎగిసిపడుతున్నాయి. ఈ క్రమంలో ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం పర్యాటకులు బీచ్కు భారీగా తరలివస్తున్నారు. కాకినాడ ఉప్పాడ తీరంలో రెమాల్ తుఫాన్ ప్రభావం తీవ్ర చూపిస్తోంది. ఇక సముద్రంలో ఒక్కసారిగా నీటి మట్టం పెరగడం, అలాగే సముద్రం ముందుకు రావడంతో మత్స్యకారులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. దీంతో తీర ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.