రేణుదేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఆద్యా, అకీరా ముచ్చట్ల నుంచి.. తన ఆరోగ్యం వివరాల వరకు.. ప్రతీది అభిమానులతో పంచుకుంటుంది రేణు. పవన్ కల్యాణ్‌తో విడిపోయినా.. పవర్‌స్టార్ ఫ్యాన్స్ ఇప్పటికీ రేణును వదినా అనే పిలుస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. ఐతే రేణుదేశాయ్ ఇప్పుడు అనారోగ్యానికి గురయ్యారు. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. ఈ మధ్యే రేణు దేశాయ్ ఓ పోస్ట పెట్టింది. బేసిక్‌గా పెట్ లవర్ అయిన రేణు.. విజయవాడ వరదల్లో జనాలనే కాదు జంతువులను కూడా కాపాడండి అంటూ పిలుపునిచ్చింది. జంతు సంరక్షణ కోసం కష్టపడుతున్న ఓ సంస్థకు అండగా నిలిచింది.
సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. విజయవాడ వచ్చి సాయం చేద్దామనుకున్నా.. ఆరోగ్యం బాలేకపోవడంతో రావడం లేదని రేణు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఐతే రేణుకు ఏమైందనే చర్చ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. నిజానికి హెల్త్ బాలేకపోవడం అనేగది పెద్ద సమస్య కాదు. వైరల్ సీజన్ కాబట్టి.. రేణుదేశాయ్ కూడా జ్వరంతో బాధపడే ప్రమాదం ఉంది. ఐతే ఇక్కడ అసలు చర్చ ఇది కాదు. ఈ మధ్య తరుచూ అనారోగ్యం బారిన పడడమే.. పవర్ ఫ్యాన్స్‌తో పాటు చాలామందిని టెన్షన్ పెడుతోంది. రేణుదేశాయ్‌కు పెద్ద ఆరోగ్య సమస్య ఉంది. ఆమె పుట్టుకతోనే గుండె జబ్బుతో పుట్టింది.
రేణు మాత్రమే కాదు.. వాళ్ల కుటుంబంలో చాలామంది గుండె సమస్యతో చాలా చిన్న వయసులోనే చనిపోయారు. ఆమె నాన్నమ్మ 47 ఏళ్ల వయసులోనే గుండె జబ్బుతో చనిపోయారు. ఇక ఆమె తండ్రి కూడా చాలా చిన్న వయసులోనే గుండె జబ్బుతో చనిపోయారు. అలాంటి హార్ట్ సమస్య ఉన్న రేణుదేశాయ్.. పదేపదే అనారోగ్యానికి గురి కావడం అభిమానులను టెన్షన్ పెడుతోంది. రేణుదేశాయ్‌కు ఏమైంది అనే చర్చ జరుగుతోంది. రేణు దేశాయ్‌కు.. గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలు ఉన్నాయ్.
అందుకే ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకుంటూ, మందులు వాడుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో తన ఆరోగ్యం సహకరించడం లేదని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో రేణు దేశాయ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రేణుకు ఏమైంది అంటూ.. కొత్త డిస్కషన్ మొదలుపెట్టారు. పవన్ కల్యాణ్, రేణుదేశాయ్ విడిపోవడానికి ఈ ఆరోగ్య సమస్యలే కారణమా అంటూ కొత్త చర్చ మొదలుపెట్టారు. పవన్ కల్యాణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న రేణుదేశాయ్… ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. కేవలం మూడేళ్ల పాటు కలిసి ఉన్న పవన్, రేణుదేశాయ్…. విడాకులు తీసుకొని దూరం అయ్యారు. ఈ ఇద్దరు విడిపోయి పదేళ్లు దాటింది. అయినా పవన్ గుర్తులు మాత్రం రేణు దేశాయ్‌ను వెంటాడుతూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తో విడాకులు తర్వాత రేణు తన ఇద్దరు పిల్లల బాధ్యతలను తానే తీసుకుంది.