రిటైర్మెంట్ జోక్ అయిపోయింది రోహిత్ కామెంట్స్ ఎవరిపైనో ?

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ కు సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటి వరకూ ఇతర క్రికెటర్లపై ఎప్పుడూ కామెంట్ చేయని హిట్ మ్యాన్ తొలిసారి సెటైర్లు వేశాడు. రిటైర్మెంట్ ప్రకటించి మళ్ళీ వెనక్కి తీసుకుని ఆడుతున్న క్రికెటర్లను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశాడు.

  • Written By:
  • Publish Date - September 19, 2024 / 03:35 PM IST

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ కు సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటి వరకూ ఇతర క్రికెటర్లపై ఎప్పుడూ కామెంట్ చేయని హిట్ మ్యాన్ తొలిసారి సెటైర్లు వేశాడు. రిటైర్మెంట్ ప్రకటించి మళ్ళీ వెనక్కి తీసుకుని ఆడుతున్న క్రికెటర్లను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశాడు. చాలామంది రిటైర్మెంట్‌ను జోక్‌గా మార్చేస్తున్నారని వ్యాఖ్యానించాడు. క్రికెటర్లు ముందుగా రిటైర్మెంట్ ప్రకటిస్తారనీ, తర్వాత మళ్లీ మైదానంలోకి వచ్చి ఆడతున్నారన్నాడు. మన దేశంలో ఎప్పుడూ ఇలా జరగలేదని, విదేశీ క్రికెటర్లు మాత్రం ఇదే ఫాలో అవుతున్నారంటూ రోహిత్ ఎద్దేవా చేశాడు.

ఇతర దేశాల ఆటగాళ్లంటే తనకు చాలా అభిమానంగా చెప్పిన హిట్ మ్యాన్ రిటైర్మెంట్ ప్రకటించి యూ టర్న్ తీసుకోవడాన్ని వ్యతిరేకించాడు. అసలు ఎందుకు రిటైర్మెంట్ ఇస్తున్నారో వారికే తెలియదంటూ సెటైర్లు వేశాడు.అయితే రోహిత్ విదేశీ ప్లేయర్స్ ను ఉద్దేశించే ఈ కామెంట్స్ చేసినట్టు అర్థమవుతోంది. పలువురు ఫారిన్ క్రికెటర్లు టీట్వంటీ లీగ్స్ లో ఆడేందుకు అంతర్జాతీయ కెరీర్ కు గుడ్ బై చెబుతున్నారు. మళ్ళీ ఐసీసీ టోర్నీల సమయానికి తాము ఆడేందుకు సిధ్ధమంటూ ప్రకటిస్తారు. ఇదిలా ఉంటే టీ ట్వంటీలకు వీడ్కోలు చెప్పడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నట్టు రోహిత్ మరోసారి చెప్పుకొచ్చాడు. వరల్డ్ కప్ గెలిచిన వెంటనే హిట్ మ్యాన్ అంతర్జాతీయ టీ ట్వంటీలకు గుడ్ బై చెప్పేశాడు.