Indiramma Housing Scheme : రేవంత్ గుడ్‌న్యూస్‌.. ఇందిరమ్మ ఇల్లు మీకే.. కండిషన్స్ ఇవే..

ఆరుగ్యారంటీల్లో భాగంగా ఇచ్చిన మరో హామీని నెరవేర్చేందుకు.. కాంగ్రెస్ సిద్ధం అయి్ంది. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం (Indiramma Housing Scheme) ప్రారంభించాలని సీఎం రేవంత్ (CM Revanth Reddy) నిర్ణయం తీసుకున్నారు. దీనికి అవసరం అయిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద అర్హులందరికీ ఈ పథకం వర్తింపజేయాలని సీఎం సూచించారు.

ఆరుగ్యారంటీల్లో భాగంగా ఇచ్చిన మరో హామీని నెరవేర్చేందుకు.. కాంగ్రెస్ సిద్ధం అయి్ంది. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం (Indiramma Housing Scheme) ప్రారంభించాలని సీఎం రేవంత్ (CM Revanth Reddy) నిర్ణయం తీసుకున్నారు. దీనికి అవసరం అయిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద అర్హులందరికీ ఈ పథకం వర్తింపజేయాలని సీఎం సూచించారు. దీనికి అనుగుణంగా విధి విధానాలను తయారు చేయాలని అన్నారు. ప్రజా పాలనలో (Public administration) నమోదు చేసుకున్న అర్హులందరికీ ముందుగా ప్రాధాన్యమివ్వాలని చెప్పారు.

గత ప్రభుత్వం డబుల్ ఇళ్ల (2BHK) నిర్మాణంలో చేసిన తప్పులు జరగకుండా.. అసలైన అర్హులకు లబ్ధి జరిగేలా చూడాలని అధికారులను అలర్ట్ చేశారు. ముందుగా ఒక్కో నియోజకవర్గానికి 3వేల 5వందల ఇళ్లను మంజూరు చేయాలని సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. దశలవారీగా ఇల్లు లేని నిరుపేదల సొంత ఇంటి కల నెరవేర్చడం తమ ప్రభుత్వ సంకల్పమని సీఎం చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇంటి స్థలం ఉన్నవారికి అదే స్థలంలో కొత్త ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇస్తారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు అందిస్తారు. ఏయే దశల్లో ఈ నిధులను విడుదల చేయాలనే నిబంధనలను సిద్ధం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. లబ్ధిదారులకు అందాల్సిన నిధులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని చెప్పారు.

సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేవారికి ఉపయోగపడేలా వివిధ రకాల ఇంటి నమూనాలు, డిజైన్లను తయారు చేయించాలని సీఎం సూచించారు. లబ్ధిదారులు సొంత ఇల్లు తనకు అనుగుణంగా నిర్మాణం చేపట్టినప్పటికీ తప్పనిసరిగా ఒక వంటగది, టాయిలెట్ ఉండేలా చూడాలన్నారు. ఇంటి నిర్మాణాలను పర్యవేక్షించే బాధ్యతలను వివిధ శాఖల్లో ఉన్న ఇంజనీరింగ్ విభాగాలకు అప్పగించాలని సీఎం సూచించారు. జిల్లా కలెక్టర్ల అధ్వర్యంలో ఇంజనీరింగ్ విభాగాలకు ఈ బాధ్యతలను ఇవ్వాలని చెప్పారు.