Amrapali Kata: రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలు మొదలయ్యాయి. హైదరాబాద్ సిటీకి సంబంధించి IPSలను బదిలీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రస్థాయిలో కీలకమైన శాఖలకు సంబంధించి IASలను కూడా బదిలీ చేశారు. వీళ్ళల్లో ఆమ్రపాలి కూడా ఉన్నారు. కేంద్ర సర్వీసులకు వెళ్ళిన ఆమె మళ్ళీ రాష్ట్రానికి చేరుకున్నారు. అయితే అందరూ అనుకున్నట్టుగా ఆమ్రపాలిని సెక్రటరియేట్‌లోకి తీసుకోలేదు సీఎం రేవంత్ రెడ్డి. ఎంతో కీలకమైన HMDA కమిషనర్‌గా ఆమ్రపాలిని నియమించారు. తెలంగాణలో IAS ఆమ్రపాలి అంటే తెలియని వారుండరు. ఏపీలోని ఒంగోలుకు చెందిన ఆమ్రపాలి 2010 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందినవారు.
REVANTH REDDY: మొన్న జీవన్ రెడ్డి.. నిన్న మల్లారెడ్డి.. ఎవరినీ వదలని రేవంత్.. బీఆర్ఎస్‌లో టెన్షన్
రాష్ట్రం విడిపోయాక తెలంగాణకు అలాట్ అయ్యారు. 2011లో వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా మొదట విధులు నిర్వహించారు. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. GHMC కమిషనర్‌గా చేస్తుండగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో జాయింట్ CEOగా నియమితులయ్యారు. కేంద్ర సర్వీసులకు వెళ్తానని అప్లికేషన్ పెట్టుకొని BRS ప్రభుత్వంలో స్వచ్ఛంధంగా ఢిల్లీకి వెళ్ళారు. తర్వాత ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తాను స్టేట్ సర్వీసులకు వస్తానని రిక్వెస్ట్ చేశారు IAS ఆమ్రపాలి. ఇదే టైమ్‌లో సీఎంగా రేవంత్ ప్రమాణం చేశాక సీఎంఓ స్పెషల్ సెక్రటరీగా ఉన్న స్మితా సబర్వాల్ ఆయన్ని కలవలేదు. ఆమె కేంద్ర సర్వీసులకు వెళ్తుందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్మితా సబర్వాల్ ప్లేసులో ఆమ్రపాలి వస్తుందని అందరూ ఊహించారు.
కానీ స్మిత తాను ఎక్కడికి వెళ్ళడం లేదని ఎక్స్‌లో క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు.. మంత్రి సీతక్క బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. లేటెస్ట్‌గా ఐఏఎస్‌ల బదిలీల్లో భాగంగా ఆమ్రపాలిని సెక్రటరియేట్‌లోకి కాకుండా HMDA కమిషనర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. HMDA కమిషనర్‌గా ఆమ్రపాలికి కీలకమైన పోస్టుని సీఎం రేవంత్ రెడ్డి కట్టబెట్టినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సహా HMDA చేపట్టిన అనేక ప్రాజెక్టులపై PCC అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి అప్పట్లో విమర్శలు చేశారు. ORR టోల్ లీజును 30యేళ్ళ పాటు ఇవ్వడంపై మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి, HMDA కమిషనర్‌గా ఉన్న అర్వింద్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. దాంతో అర్వింద్ కుమార్.. రేవంత్‌కు లీగల్ నోటీసులు కూడా పంపారు. నోటీసులు వెనక్కి తీసుకోకపోతే సివిల్, క్రిమినల్ కేసులు పెడతామని రేవంత్ హెచ్చరించారు.
PAWAN KALYAN: ఒక్క సీటు కూడా వైసీపీకి వెళ్లొద్దు.. జనసైనికులకు పవన్ కల్యాణ్ పిలుపు
ఇప్పుడు HMDA కమిషనర్ బాధ్యతలు ఆమ్రపాలికి అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి ORR టోలు అగ్రిమెంట్స్‌తో పాటు BRS ప్రభుత్వ హయంలో జరిగిన అన్ని ఒప్పందాలు, ప్రాజెక్టులపై ఎంక్వైరీ చేయించే అవకాశాలు ఉన్నాయి. గోల్‌మాల్ వ్యవహారాలను బయటకు తీయించేందుకే ఆమ్రపాలిని సెక్రటరియేట్‌లోకి కాకుండా HMDAలోకి పంపినట్టు తెలుస్తోంది. ఈ లొసుగులను ఆమ్రపాలి ఎలా బయటకు తీసుకొస్తారన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.