REVANTH REDDY: పేదలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడదాం: రేవంత్ రెడ్డి

కేసీఆర్‌కు రెండుసార్లు అవకాశం ఇచ్చారు.. ఈసారి ఒక్క అవకాశం కాంగ్రెస్‌కు ఇవ్వండి. పేదలకు ప్రవేశంలేని ప్రగతిభవన్ గేట్లు బద్దలు కొట్టాల్సిన బాధ్యత మీపై ఉందా..? లేదా..? ఉద్యమంలో సమిధలైంది నిరుద్యోగులు. నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోని కేసీఆర్‌ను ఈ ఎన్నికల్లో పాతరేయాలి.

  • Written By:
  • Updated On - November 26, 2023 / 08:19 PM IST

REVANTH REDDY: తెలంగాణ ఉద్యమంలో సమిధలైంది నిరుద్యోగులే అని, పేదలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టాలని పిలుపునిచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆదివారం శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి జగదీష్ గౌడ్‌ తరఫున రేవంత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌పై విమర్శలు చేశారు. “శేరిలింగంపల్లిలో ఎమ్మెల్యే గాంధీని ఈ ఎన్నికల్లో వంద మీటర్ల గోతి తీసి పాతిపెట్టాలి. ఎమ్మెల్యే గాంధీ ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడతారని మీరు భావించారు.

PM MODI: ఫాంహౌజ్‌కే పరిమితమయ్యే సీఎం అవసరమా..? బీజేపీతోనే సామాజిక న్యాయం సాధ్యం: ప్రధాని మోదీ

కానీ భూములను అక్రమించుకుని, తెగనమ్ముకుని అన్యాయం చేశారు. బీహెచ్ఈఎల్ ఏర్పాటు సమయంలో జగదీష్ గౌడ్ కుటుంబం 200 ఎకరాలు కోల్పోయింది. ప్రజల మంచి కోరే ఆ కుటుంబానికి చెందిన జగదీష్ గౌడ్‌ను ఈ ఎన్నికల్లో ఆశీర్వదించండి. కేసీఆర్‌కు రెండుసార్లు అవకాశం ఇచ్చారు.. ఈసారి ఒక్క అవకాశం కాంగ్రెస్‌కు ఇవ్వండి. పేదలకు ప్రవేశంలేని ప్రగతిభవన్ గేట్లు బద్దలు కొట్టాల్సిన బాధ్యత మీపై ఉందా..? లేదా..? ఉద్యమంలో సమిధలైంది నిరుద్యోగులు. నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోని కేసీఆర్‌ను ఈ ఎన్నికల్లో పాతరేయాలి. 30 లక్షల నిరుద్యోగుల గురించి ఆలోచించని కేసీఆర్.. ఆయన మనవడిని మంత్రిని చేసేందుకు తాపత్రయపడుతున్నారు. కేసీఆర్ బక్కోడు కాదు.. భూ బకాసురుడు.. ఈ బకాసురుడిని బొందపెట్టాలి. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం.

చర్లపల్లి జైలులో కేసీఆర్ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించడం ఖాయం. బీఆరెస్‌ను బొందపెడితేనే.. రాష్ట్రానికి పట్టిన చీడ, పీడ విరగడవుతుంది. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందాయి. శేరిలింగంపల్లిలో కాంగ్రెస్‌ను గెలిపించండి. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం” అని రేవంత్ వ్యాఖ్యానించారు.