REVANTH REDDY: నల్లగొండ గడ్డ కాంగ్రెస్ అడ్డా.. ఇందిరమ్మ రాజ్యం తెచ్చే బాధ్యత మాది: రేవంత్ రెడ్డి

తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవిని వదులుకుండు. కేసీఆర్ ఎన్నడూ పదవులను పూచికపుల్లలా వదిలేయలేదు. ఎలక్షన్లు, సెలక్షన్లు, కలెక్షన్లు విధానంతో కేసీఆర్ ముందుకెళ్లిండు. కానీ వెంకట్ రెడ్డి తెలంగాణ వచ్చే వరకు మంత్రి పదవి తీసుకోలేదు.

  • Written By:
  • Publish Date - November 24, 2023 / 06:03 PM IST

REVANTH REDDY: ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అడ్డా అని, ఇక్కడి 12 స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని ఆకాంక్షించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డిని గెలిపించాలని కోరారు. “తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవిని వదులుకుండు. కేసీఆర్ ఎన్నడూ పదవులను పూచికపుల్లలా వదిలేయలేదు. ఎలక్షన్లు, సెలక్షన్లు, కలెక్షన్లు విధానంతో కేసీఆర్ ముందుకెళ్లిండు. కానీ వెంకట్ రెడ్డి తెలంగాణ వచ్చే వరకు మంత్రి పదవి తీసుకోలేదు.

PAWAN KALYAN: తెలంగాణ సమగ్ర అభివృద్దే లక్ష్యం.. జనసేన, బీజేపీ సమన్వయంతో పని చేయాలి: పవన్ కళ్యాణ్

చిరుమర్తి లింగయ్యను రెండుసార్లు గెలిపిస్తే పార్టీని నమ్ముకున్న కార్యకర్తల గుండెలపై తన్నిండు. పార్టీ ఫిరాయించి దొర గడీలో మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండు. పార్టీ ఫిరాయించిన 12 మందిలో ఏ ఒక్కరినీ అసెంబ్లీ గేటు తాకనీయొద్దు. అక్కడి సూర్యుడు ఇక్కడమొలిచినా.. ప్రాణం పోయినా.. ఏ ఒక్కరినీ అసెంబ్లీ గేటును తాకనివ్వొద్దు. ఇప్పుడు మీరు ఇవ్వబోయే తీర్పు వందేళ్ల వరకు చరిత్రలో నిలిచిపోవాలి. ఆనాడు వెంకన్న వైఎస్‌తో కొట్లాడి ఎస్ఎల్బీసీ టన్నెల్ ద్వారా 3 లక్షల 60 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ప్రాజెక్టు మంజూరు చేయించారు. ఉమ్మడి రాష్ట్రంలో 30 కిలోమీటర్లు టన్నెల్ తవ్వారు. ఇంకో పది కిలోమీటర్లు పూర్తి చేస్తే ఈ ప్రాంతానికి నీళ్లు వచ్చేవి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి, కాంగ్రెస్‌కు పేరు వస్తుందనే ఎస్ఎల్బీసీని కేసీఆర్ పడావు పెట్టారు. నకిరేకల్ వేదికగా కేసీఆర్‌ను సూటిగా అడుగుతున్నా.. ఎస్ఎల్బీసీని ఎందుకు పూర్తి చేయలేదు..? కేసీఆర్ బక్కోడు కాదు.. మేల్కొంటే బకాసురుడు.. పడుకుంటే కుంభకర్ణుడు. నల్లగొండ గడ్డ కాంగ్రెస్ అడ్డా.

ఉమ్మడి జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి. వెంకట్ రెడ్డి, నేను ఇద్దరం అనుకుంటే.. ఈ ప్రాంతంలో బీఆరెస్ జెండా ఎక్కడా కనిపించదు. బీఆరెస్‌లో ఎవ్వరూ గెలవరు. జిల్లాలో 12కు 12 స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించండి. డిసెంబర్ 9న కేసీఆర్‌ను, బీఆరెస్‌ను బొందపెట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చే బాధ్యత మాది. 60 ఏళ్లల్లో 16 మంది సీఎంలు చేసిన అప్పు రూ.69 వేల కోట్లు. కానీ పదేళ్లలో కేసీఆర్ కుటుంబం చేసిన అప్పు రూ.6 లక్షల కోట్లు. ఎవడు దొంగ.. ఎవడు గజదొంగ అనేది తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. కేటీఆర్.. మీ అయ్య వంద నోటులాంటి వాడు కాదు.. దొంగనోటు లాంటివాడు” అని రేవంత్ వ్యాఖ్యానించాడు.