REVANTH REDDY: తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రం అని కేసీఆర్ చెబుతున్నాడని, కానీ, ఆత్మహత్యల్లో, నిరుద్యోగుల్లో, తాగుబోతుల్లో మాత్రం నెంబర్ వన్‌గా మార్చారని విమర్శించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సోమవారం ఆయన నర్సాపూర్‌లో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌పై విమర్శలు చేశారు. “చీమలు బారులు తీరినట్లుగా ఈ సభకు వేలాదిగా తరలివచ్చిన మీకు అభినందనలు. నాయకులు పదవుల కోసం అమ్ముడుపోయినా కార్యకర్తలు పార్టీని గెలిపించడానికి ఇక్కడికి వచ్చారు. పార్టీ ఫిరాయించిన ఒక నమ్మకద్రోహికి బీఆరెస్ ఇక్కడ టికెట్ ఇచ్చింది. నర్సాపూర్‌ను చార్మినార్ జోన్‌లో కలిపే అంశాన్ని కాంగ్రెస్ పరిగణనలోకి తీసుకుంటుంది. నర్సాపూర్ లాంబాడి సోదరుల అడ్డా. లాంబాడాల అభివృద్ధికి ఈ ప్రభుత్వం చేసిందేం లేదు. అధికారంలోకి రాగానే నర్సాపుర్ పరిధిలోని లంబాడా తండాల అభివృద్ధి కోసం రూ.100 కోట్ల ప్రత్యేక నిధులు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్‌ది.
PAWAN KALYAN: తెలంగాణలో పవన్ కల్యాణ్ ప్రచారం.. 22న వరంగల్‌లో రోడ్డు షో..!
బంగారు తెలంగాణ చేస్తామన్న కేసీఆర్ బొందలగడ్డ తెలంగాణగా మార్చారు. మాట్లాడితే కేసీఆర్ తెలంగాణ నెంబర్ 1 అని చెప్తుండు. రైతుల ఆత్మహత్యల్లో నెంబర్ వన్. నిరుద్యోగ సమస్యల్లో నెంబర్ వన్. దేశంలో తాగుబోతుల్లోనే తెలంగాణ నెంబర్ 1. అమ్ముడుపోయి, కేసీఆర్ పంచన చేరిన వారిని అసెంబ్లీ గేటు తాకనివ్వద్దు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఆకలి కేకల రాజ్యం అని కేసీఆర్ అంటుండు. ఇందిరమ్మ రాజ్యం అంటే మా లాంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చిన రాజ్యం. తండాల్లో.. మారుమూల పల్లెల్లో పేదలకు నిలువ నీడనిచ్చి.. ఇండ్లు నిర్మించి ఇచ్చిన రాజ్యం. భూమి ఆత్మగౌరవం. అలాంటిది 25లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పంచిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. దళితులు ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేసింది ఇందిరమ్మ రాజ్యం. పోడు భూములకు పట్టాలు ఇచ్చిన రాజ్యం. సాగునీటి ప్రాజెక్టులు కట్టి వ్యవసాయానికి సాగునీరు అందించిన రాజ్యం. స్థానిక సంస్థల్లో ఆడబిడ్డలకు రిజర్వేషన్లు కల్పించిన రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం లేకపోతే.. సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ కుటుంబం అడుక్కు తినేది.
కేసీఆర్.. సిద్దిపేటలో సింగిల్ విండో డైరెక్టర్‌గా నీకు అవకాశం ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యం.. కాంగ్రెస్ కాదా? కేసీఆర్.. ఆనాడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నిన్ను నియమించిన సంజయ్ గాంధీ ఇందిరమ్మ కొడుకు అనే సంగతి మరిచిపోయావా..? తిన్నింటి వాసాలు లెక్కబెట్టే కేసీఆర్ను వంద మీటర్ల గోతి తీసి పాతిపెట్టాలి. తెలంగాణలో అరాచకం రాజ్యమేలుతోంది. రాచరిక పాలన సాగుతోంది. ఇక కేసీఆర్ పాలనకు కాలం చెల్లింది. ఆయన్ను ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చేసింది. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్‌ను గెలిపించండి. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసే బాధ్యత మాది. నిజాం నిరంకుశ పాలనపై ఎక్కుపెట్టిన ఫిరంగి పరకాల. తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ సార్ పుట్టిన గడ్డ ఇది. అలాంటి ఈ గడ్డను ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేసే బాధ్యత మాది. మచ్చలేని , అవినీతి మరక లేని నాయకుడు రేవూరి ప్రకాష్ రెడ్డి. కేసీఆర్ మతి తప్పి మాట్లాడుతుండో.. మందేసి మాట్లాడుతుండో తెలియదు.
ఇందిరమ్మ రాజ్యాన్ని తప్పుపడుతుండు. దొరల రాజ్యం కావాలా..? ఇందిరమ్మ రాజ్యం కావాలా పరకాల ప్రజలు తేల్చుకోవాలి. ఈ ప్రాంతంలో అభివృద్ధి ఇందిరమ్మ రాజ్యంలోనే జరిగింది. ఇందిరమ్మ రాజ్యాన్ని తప్పుపట్టిన కేసీఆర్ ముక్కు నేలకురాసి క్షమాపణ చెప్పాలి. సోనియమ్మ మాటంటే శిలాశాసనం. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చినట్లే అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం” అని రేవంత్ వ్యాఖ్యానించారు.