REVANTH REDDY: రైతులను ఆదుకుంటామని చెప్పి కేసీఆర్ మాట తప్పాడు: రేవంత్ రెడ్డి

అబద్దాలు చెప్పి మోసం చేయడంలో కేసీఆర్‌తో ప్రపంచంలోనే ఎవరూ పోటీ పడలేరు. బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులను ఏడాదిలో పూర్తి చేస్తామని కేసీఆర్ చెప్పిండు. కుర్చీ వేసుకుని కూర్చుని ప్రాజెక్టులు కడతమన్న కేసీఆర్.. మందేసి ఫామ్ హౌస్‌లో పడుకున్నావా..?

  • Written By:
  • Publish Date - November 22, 2023 / 05:15 PM IST

REVANTH REDDY: కుర్చీ వేసుకుని కూర్చుని ప్రాజెక్టులు కడతామన్న కేసీఆర్.. మందేసి ఫామ్ హౌస్‌లో పడుకున్నాడా అని విమర్శించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నారాయణ ఖేడ్‌లో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పించారు. “మీ ఉత్సాహం చూస్తోంటే నారాయణ్ ఖేడ్ గడ్డపై సంజీవ రెడ్డి 50 వేల మెజారిటీతో గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. నాడు అప్పారావు షెట్కార్, శివరాజ్ షెట్కార్ స్వాతంత్ర్యం కోసం నినదించిన కుటుంబం షెట్కార్ కుటుంబం.

REVANTH REDDY: శ్రీరాం సాగర్ చూపించి ఓట్లడుగుతాం.. కాళేశ్వరం చూపించి ఓట్లడుగుతావా.. కేసీఆర్‌కు రేవంత్ సవాల్..

అలాంటి కుటుంబానికి చెందిన సురేష్ షెట్కార్‌ను పార్లమెంటు సభ్యుడిగా గెలుపించుకునే బాధ్యత మాది. ఇందిరమ్మ రాజ్యంలో నారాయణ్ ఖేడ్‌ను అభివృద్ధి చేసే బాధ్యత మాది. అబద్దాలు చెప్పి మోసం చేయడంలో కేసీఆర్‌తో ప్రపంచంలోనే ఎవరూ పోటీ పడలేరు. బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులను ఏడాదిలో పూర్తి చేస్తామని కేసీఆర్ చెప్పిండు. కుర్చీ వేసుకుని కూర్చుని ప్రాజెక్టులు కడతమన్న కేసీఆర్.. మందేసి ఫామ్ హౌస్‌లో పడుకున్నావా..? నల్లవాగు పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని చెప్పి, కేసీఆర్ మాట తప్పిండు.

కాంగ్రెస్‌ను గెలిపిస్తే ప్రత్యేక నిధులతో ఇక్కడి తండాలను అభివృద్ధి చేస్తాం. సర్పంచులకు బిల్లులు రావాలంటే నియోజకవర్గంలో భూపాల్ రెడ్డిని బండకేసి కొట్టాలి. కేసీఆర్ తాత దిగొచ్చినా.. నారాయణ్ ఖేడ్, జహీరాబాద్ పార్లమెంటు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం” అంటూ ప్రసంగించారు.