REVANTH REDDY: 80 వేల బుక్స్ చదివి ఏం లాభం.. కేసీఆర్‌పై రేవంత్ పంచ్.. అసెంబ్లీలో రెచ్చిపోయిన సీఎం

అతిగొప్ప మేథావిగా చెప్పుకునే కేసీఆర్ కనీసం అసెంబ్లీకి కూడా రావటం లేదు. మా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే సూచనలు చేస్తారని అనుకున్నాం. కేటీఆర్.. నువ్వు ఇంకా ఆంధ్రోనివే. గుంటూరు వాసనలు పోలే.

  • Written By:
  • Updated On - February 9, 2024 / 07:40 PM IST

REVANTH REDDY: మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్ పంచ్‌ల వర్షం కురిపించారు. బీఆర్ఎస్‌పై మాటల దాడి చేశారు. కేసీఆర్ 80 వేల బుక్స్ చదివి ఏం ప్రయోజనమని, అసెంబ్లీకి కూడా రావడం లేదని విమర్శించారు రేవంత్. శుక్రవారం రేవంత్ అసెంబ్లీలో గవర్నర్‌కు ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడారు. “సభలో కేసీఆర్‌ ఉంటేనే కిక్కు. అసలు కేసీఆర్ సభకు వస్తారా..? అతిగొప్ప మేథావిగా చెప్పుకునే కేసీఆర్ కనీసం అసెంబ్లీకి కూడా రావటం లేదు. మా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే సూచనలు చేస్తారని అనుకున్నాం.

REVANTH REDDY: రేవంత్‌కు షాక్.. ఓటుకు నోటు కేసులో సుప్రీం నోటీసులు

2014 నుంచి 23 వరకూ కేఆర్ఎంబీ సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు కేసీఆర్ వెళ్లారు. మేము ఇంత వరకూ ఏ సమావేశాలకు వెళ్లలేదు. ప్రాజెక్టులను కేంద్రం ఆధీనంలోకి తీసుకుంటానన్న మోదీకి వ్యతిరేకంగా ఢిల్లీకి వెళ్లి ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. మా ప్రభుత్వం అందుకు సంపూర్ణ మద్దతు ఇస్తుంది. తెలంగాణ జల హక్కులను ఏపీకి కట్టబెట్టిన బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న తీరు సిగ్గుచేటుగా ఉంది. పోలింగ్ రోజు కూడా సాగర్ ప్రాజెక్ట్ పై కుట్ర చేశారు. ఏపీ పోలీసులు ఆ రోజు ఎలా వచ్చారు..? ఇంటి దొంగల మద్దతు లేకుండా వాళ్లు వస్తారా..? నువ్‌ ఇంటికి పిలిచి అన్నం పెడితే.. జగన్‌ శ్రీశైలం కింద బొక్క పెట్టిండు. బీఆర్ఎస్ పార్టీలో జూనియర్ ఆర్టిస్ట్ (కేటీఆర్) ఉన్నారు. ఈ మధ్య ఆయన ఆటోలు ఎక్కడి డ్రామాలు మొదలుపెట్టారు. కేటీఆర్.. నువ్వు ఇంకా ఆంధ్రోనివే. గుంటూరు వాసనలు పోలే. సినిమా వాళ్లను మించిపోతున్నావ్‌ KTR. ఇందుకే నిన్ను డ్రామారావు అనేది. మహిళలకు ఫ్రీ బస్సు పథకం ఉండగా ఆటో వారిని బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్రీ బస్సు పథకం వల్ల నష్టపోతున్నామని ఎవరైనా ఆటోను తగలబెట్టుకుంటారా..? బీఆర్ఎస్, బీజేపీ స్నేహంతో ఉన్నాయి.

కేసీఆర్ సొంత పార్టీ నేతలకు కూడా ముఖ్యమైన విషయాలు చెప్పరు. బీఆర్ఎస్ నేతలకు అనుమానం ఉంటే నా దగ్గరకు వచ్చి కలిస్తే అన్నీ వివరిస్తా. కేసీఆర్ సీఎంగా ఉండగా కొంత మంది మంత్రులు అవిశ్వాసం ప్రకటించి.. కేటీఆర్‌ను సీఎం చేయాలని చూశారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక కేసీఆర్.. మోదీ దగ్గరకు వెళ్లి కేటీఆర్‌ను సీఎం చేస్తానని చెప్పారు. అందుకు ప్రధాని అనుమతి కూడా కోరారు. ఈ విషయాన్ని మోదీనే స్వయంగా చెప్పారు. మోదీ తీసుకువచ్చిన చట్టాలకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. టీఎస్ పేరు టీజీగా మారుతుంది. గ్రూప్ 1 అప్లికేషన్ వయోపరిమితి 46కు పెంచుతాం. నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యేలు కలవొచ్చు. వినతిపత్రాలు తీసుకువచ్చే ఏ ఎమ్మెల్యేనైనా కలుస్తాం. 100 రూపాయల పెట్రోల్‌ కొన్నోడు రూపాయి అగ్గిపెట్ట కొనుక్కోడా?” అని రేవంత్ వ్యాఖ్యానించారు.
https://youtu.be/BtEX2scl-ps