REVANTH REDDY: దాడుల పేరుతో బీఆర్ఎస్ డ్రామాలు.. హరీష్ రావుది సురభి నాటకం: రేవంత్ రెడ్డి

తెలంగాణలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ యువకుడు దాడి కత్తి చేశాడు. గాయపడ్డ ప్రభాకర్ రెడ్డి నడుస్తుంటే.. మంత్రి హరీష్ పరుగెత్తి సురభి డ్రామాను మించి నాటకాలాడారు.

  • Written By:
  • Publish Date - November 12, 2023 / 06:33 PM IST

REVANTH REDDY: తెలంగాణలో తమపై దాడులు జరుగుతున్నాయంటూ బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతోందని, హరీష్ రావుది సురభి నాటకమని విమర్శించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆదివారం సాయంత్రం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్, ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. ‘‘15 రోజుల్లో ప్రభుత్వంపై కుట్రలు జరగబోతున్నాయని డ్రామారావు అంటుండు. ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికల ముందు ఇలాంటి దాడులే జరిగాయి. 2018లో విశాఖలో ఎయిర్ పోర్టులో కోడి కత్తి దాడి జరిగింది. 2021లో పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీపై దాడి ఘటన జరిగింది. ఫలితాలు వచ్చిన తరువాత దాడిలో కుట్ర లేదని తేల్చారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ యువకుడు దాడి కత్తి చేశాడు. గాయపడ్డ ప్రభాకర్ రెడ్డి నడుస్తుంటే.. మంత్రి హరీష్ పరుగెత్తి సురభి డ్రామాను మించి నాటకాలాడారు.

REVANTH REDDY: ఇది పీకే స్ట్రాటజీ!? పీకే డైరెక్షన్‌లో నడుస్తున్న కేసీఆర్: రేవంత్ రెడ్డి

ఈ దాడి వెనక కాంగ్రెస్ ఉందని కేసీఆర్ కుటుంబమంతా ప్రచారం చేసింది. కానీ దాడిలో కుట్ర కోణం లేదని, సెన్సేషన్ కోసమే దాడి అని పోలీసులే చెప్పారు. కేసులో అరెస్టు చేసిన ఆ యువకుడి రిమాండ్ రిపోర్ట్ ఇంత వరకు ఎందుకు బయటపెట్టలేదు? రిమాండ్ రిపోర్ట్ బయట పెట్టకపోవడంలో అంతర్యమేంటి? హరీష్ రావుకు.. దాడికి పాల్పడ్డ యువకుడికి మధ్య ఫోన్ సంభాషణ ఏమైనా ఉందా? దాడులు జరుగుతాయంటున్న కేటీఆర్ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలి. గువ్వల బాలరాజును పరామర్శ పేరుతో డ్రామారావు మరో డ్రామాకు తెర తీశారు. కర్ణాటక నేత కుమారస్వామి ప్రెస్ మీట్ గురించి తెలంగాణలో టీవీ ఛానళ్లు ప్రసారం చేయాలని మంత్రి హరీష్ ఛానళ్లకు ఫోన్ లు చేశారు. మూడోసారి కేసీఆర్ ను సీఎం చేయడానికి బీఆరెస్, బీజేపీ, జేడీఎస్, ఎంఐఎం దుష్ట చతుష్టయం కుట్ర చేస్తున్నాయి.

రిటైర్ అయిన అధికారులపై చర్యలు చేపట్టాలని మేం ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు స్పందన లేదు. ఫోన్ లను హ్యాకింగ్ చేస్తున్నా కేంద్ర ఎన్నికల సంఘం మౌనంగా ఉంటుంది. బీజేపీ స్పష్టంగా బీఆరెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. మేడిగడ్డ కుంగిన ఘటనలో అసాంఘిక శక్తుల పని అని తప్పుడు కేసులుపెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ ను బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్న బీఆరెస్ పై చర్యలు తీసుకోవాలి. కోడికత్తి వ్యూహాన్ని తెలంగాణలో అమలు చేసి సానుభూతి పొందాలని బీఆరెస్ ప్రయత్నిస్తోంది. అందుకే కేటీఆర్ 15 రోజుల్లో కుట్ర జరగబోతుందని ప్రజలకు సంకేతాలు ఇచ్చారు. అధికారం కోసం ఎంతటి దారుణానికి తెగబడేందుకు బీఆరెస్ సిద్ధమవుతోంది. మైనారిటీలను బీసీల్లో కలుపుతారని కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కమిటీలు ఎప్పుడో నివేదిక ఇచ్చాయి.

ROHIT SHARMA: ఓపెనర్‌గా 14 వేలకుపైగా రన్స్‌.. రోహిత్ శర్మ మరో రికార్డు

డిసెంబర్ లో పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం బిల్లు పెడితే సరిపోతుంది. వర్గీకరణ బిల్లుకు కాంగ్రెస్ అన్ కండిషనల్ మద్దతు ఇస్తుంది. మాదిగలను మరోసారి మోదీ మోసం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ భయపడొద్దు.. బీఆరెస్ కుట్రలను తిప్పికొట్టండి. బీఆరెస్ నేతల్లా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై మా నాయకులు రెడ్ డైరీ లో రాసి పెడుతున్నారు. అధికారంలోకి రాగానే వారిపై చర్యలు ఉంటాయి. 24గంటల ఉచిత విద్యుత్ పై సూటిగా సవాల్ విసురుతున్నా. రాష్ట్రంలో ఏ గ్రామానికైనా వెళదాం.. 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం. శకునం పలికే బల్లి కుడితిలో పడి చచ్చినట్లు కేటీఆర్ వైఖరి ఉంది. కొడంగల్ లో నన్ను ఒడిస్తానంటున్న కేటీఆర్ ముందు సిరిసిల్లలో చూసుకోవాలి” అని రేవంత్ వ్యాఖ్యానించారు.