KCR MEDIGADDA: అక్రమాల మేడిగడ్డ చూసొద్దాం.. కేసీఆర్‌కు రేవంత్ ఆహ్వానం

మేడిగడ్డను విజిట్ చేసేందుకు 119 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం పలికారు సీఎం రేవంత్ రెడ్డి. ఈనెల 13న ఆ ప్రాజెక్ట్‌ను సందర్శించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీ వేదిక పిలిచారు. అయితే రేవంత్ పిలుపుల సమయంలో మాజీ సీఎం కేసీఆర్ సభలో లేరు.

  • Written By:
  • Publish Date - February 10, 2024 / 02:32 PM IST

KCR MEDIGADDA: బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిందే మేడిగడ్డ బ్యారేజ్. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే పిల్లర్లు కుంగిపోయాయి. కోట్ల రూపాయలు పెట్టి రిపేర్లు చేసినా.. భవిష్యత్తులో ప్రాజెక్ట్ పనికి వస్తుందో రాదో తెలియని పరిస్థితి. అలాంటి మేడిగడ్డను విజిట్ చేసేందుకు 119 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం పలికారు సీఎం రేవంత్ రెడ్డి. ఈనెల 13న ఆ ప్రాజెక్ట్‌ను సందర్శించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీ వేదిక పిలిచారు. అయితే రేవంత్ పిలుపుల సమయంలో మాజీ సీఎం కేసీఆర్ సభలో లేరు.

CHIRANJEEVI VS BALAKRISHNA: బాలయ్య రేంజ్.. చిరంజీవిని మించిపోతుందా..?

అందుకే ఆయన్ని స్వయంగా ఆహ్వానించడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కేసీఆర్ ఇంటికి పంపుతున్నారు. మీ పాపాలకు సజీవసాక్ష్యం ఎలా ఉందో చూడాలని కోరుతున్నట్టు ఉంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం.. ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలపై విచారణకు సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని హైకోర్టును కోరు సీఎం రేవంత్ రెడ్డి. అందుకు కోర్టు ఒప్పుకోలేదు. రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించుకోవాలని సలహా ఇచ్చారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఇప్పుడు ఎవరితో విచారణ చేయించాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు ప్రభుత్వం. కానీ ఇటీవల కాలంలో మేడిగడ్డ ఇష్యూని బయటకు రానీయకుండా.. బీఆర్ఎస్ నేతలు KRMBని హైలెట్ చేస్తున్నట్టు గుర్తించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే విషయాన్ని రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన చిట్ చాట్ లో కూడా చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే విషయంలోనూ బీఆర్ఎస్ నేతలు పదే పదే KRMB కి కృష్ణా ప్రాజెక్టులు అప్పగించారని ఆరోపణలు చేశారు.

Pushpa 2: పుష్ప ఫీవర్.. ‘పుష్ప 2’ మామూలుగా ఉండదట

మీ హయాంలోనే ఆ పాపం చేశారని దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. KRMB ఇష్యూతో మేడిగడ్డ ఇష్యూ పక్కకు పోకుండా సీఎం రేవంత్ భలే ప్లాన్ వేశారు. రాష్ట్రంలోని అందరు ఎమ్మెల్యేలతో కలసి మేడిగడ్డ ప్రాజెక్ట్ విజిట్ చేయాలని నిర్ణయించారు. ఈనెల 13న బీఆర్ఎస్, బీజేపీ, MIM, సీపీఐతో సహా అందరు ఎమ్మెల్యేలు రావాలని పిలుపు ఇచ్చారు. అయితే ఈ ఆహ్వానంపై సభలో బీఆర్ఎస్ లీడర్లు ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్‌ను కూడా మేడిగడ్డకు ప్రత్యేకంగా ఆహ్వానించాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. అందుకోసం మంత్రి ఉత్తమ్ ను కేసీఆర్ ఇంటికి పంపుతున్నారు. ఈ విజిట్ 13వ తేదీన డిసైడ్ చేయడానికి ఇంకో కారణం కూడా ఉంది. అదే రోజు నల్లగొండలో BRS సభ నిర్వహిస్తోంది. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడంపైనే ఈ సభ ఏర్పాటు చేసింది. దానికి విరుగుడుగానే సీఎం రేవంత్ వ్యూహాత్మకంగా మేడిగడ్డ, కాళేశ్వరం టూర్‌కి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

నల్లగొండ సభ ఉన్న రోజే మేడిగడ్డ విజిట్ ఉండటంతో.. మాజీ సీఎం కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ రేవంత్ ఆహ్వానాన్ని ఒప్పుకునే ఛాన్స్ లేదు. ఏ ఒక్క BRS ఎమ్మెల్యే కూడా ఈ టూర్‌కి రారు. పైగా మీ పాపాలను చూద్దాం రండి అని పిలిస్తే మాత్రం గులాబీ లీడర్లు ఎగేసుకొని ఎలా వస్తారు..? కేవలం 13న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగే సభకు పోటీగానే మేడిగడ్డ టూర్ కి సీఎం రేవంత్ ప్లాన్ చేసినట్టు స్పష్టంగా అర్థమవుతోంది.