తెలంగాణ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. కాగా రేవంత్ రెడ్డి పై ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేత హాట్ కామెట్స్ చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండటం చాలా సంతోషించదగ్గ విషయమని ఏపీ టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు నని చెప్పారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ మిత్ర పక్షాలేనని అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం పంపకాల విషయంలో నెలకొన్న విభేదాలను పరిష్కరించుకోవడానికి ఇప్పుడు ఓ అవకాశం వచ్చిందని చెప్పారు. రేవంత్ రెడ్డి సీఎం అయితేనే బాగుంటుందని.. రేవంత్ సీఎంగా ఉంటే.. విభజన పంపకాలు సూలువుగా జరుగుతాయి అని అన్నారు.
ఇక వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఘన విజయం సాధించడం ఖాయమని.. చంద్రబాబు మరోసారి సీఎం అవుతారని జేసీ ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో గురువు చంద్రబాబు, తెలంగాణలో శిష్యుడు రేవంత్ రెడ్డి సీఎంలుగా ఉంటే రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించుకోవచ్చని చెప్పారు. అధికారంలో ఉన్న పార్టీపై ప్రజా వ్యతిరేకత ఉండటం సహజమని అన్నారు. ఏపీలో మంచి పాలన అందించే సత్తా కేవలం చంద్రబాబుకే ఉందని చెప్పుకోచ్చారు.