REVANTH REDDY: ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ రైతులకు కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రైతులకు వెంటనే పెట్టుబడి సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధులను విడుదల చేసి, వెంటనే చెల్లింపులు ప్రారంభించాలని సీఎం సూచించారు. గతంలో మాదిరిగా రైతులకు ఈ చెల్లింపులు చేయాలని అధికారులను ఆదేశించారు.
YSRCP: ఏపీలో 11 నియోజకవర్గాల్లో వైసీపీ ఇంఛార్జులు మార్పు..
నిజానికి ఇప్పటికే రైతు బంధు నిధులు విడుదల చేయాలి. కానీ, ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో గత ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెట్టుబడి సాయాన్ని పెంచుతామని చెప్పారు. దీని ప్రకారం.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన రైతు భరోసా పథకం కింద నిధులు విడుదల చేయాల్సి ఉంది. కానీ, ఈ పథకానికి ఇంకా విధి విధానాలు ఖరారు కాలేదు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి.. ప్రస్తుతానికి గతంలో ఉన్న రైతుబంధు పథకం లబ్ధిదారులకు పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం జమకానుంది.