REVANTH REDDY: కేంద్రంతో ఘర్షణ వైఖరి రాష్ట్రాభివృద్ధికి ప్రమాదకరమన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధికి పెద్దన్నలా సహకరించాలని ప్రధాని మోదీని కోరారు రేవంత్. ఆదిలాబాద్‌లో సోమవారం ప్రధాని మోదీ పర్యటించారు. ఆరు ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు మోదీ. ఈ సందర్భంగా జరిగిన సభలో మోదీతోపాటు గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సభలో రేవంత్ మాట్లాడుతూ ప్రధాని తనకు పెద్దన్నలాంటి వారన్నారు. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు.
Prashant Kishore : బిహార్‌లో పనేం లేదా ? పీకేను ఆటాడుకుంటున్న వైసీపీ నేతలు
“రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎన్‌టీపీసీకి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధికి కుంటుపడుతుంది. గత ప్రభుత్వ నిర్ణయాలతో విద్యుత్ ఉత్పత్తిలో వెనుకబడ్డాం. రాష్ట్రాభివృద్ధి కార్యాచరణతో ముందుకెళ్తాం. రాజకీయాలు కేవలం ఎన్నికల సమయంలోనే చేయాలి. ఆ తర్వాత అంతా అభివృద్ధి గురించే చర్చలు ఉండాలి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ప్రధాని మోదీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ది పనుల గురించి చర్చించాం. మావైపు నుంచి ఎలాంటి భేషజాలు లేవు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు వెళ్తాం. హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలను దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసినందుకు ప్రధానికి కృతజ్ఞతలు. ఇది తెలంగాణ అభివృద్ధిలో కీలకమైన స్కైవేల నిర్మాణానికి ఇది ఉపయోగపడుతుంది. దేశం 5 ట్రిలియన్ ఆర్థికవ్యవస్థ చేరడంలో హైదరాబాద్ కీలకపాత్ర పోషిస్తుంది.
దేశవ్యాప్తంగా మెట్రో నగరాల అభివృద్ధిలో భాగంగా భాగ్యనగరానికి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని కోరుతున్నాం. ఆదిలాబాద్ జిల్లాకు సాగునీటిని అందించేందుకు తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహకరించాలి. మూసీ రివర్ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి. రాష్ట్రాభివృద్ధికి పెద్దన్నలా ప్రధాని మోదీ సహకరించాలి. టెక్స్‌టైల్ రంగంలోనూ భారీగా నిధులు కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. గుజరాత్‌లా తెలంగాణ అభివృద్ధి చెందేందుకు మీ సహకారం కావాలి” అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.