TG IPS transfer : పాలన ప్రక్షాళన చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్.. తెలంగాణలో 8 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ..

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రాష్ట్రంలో ఉన్న గత ప్రభుత్వం అధికారులను మారుస్తు.. పాలన ప్రక్షాళన చేస్తుంది. కాగా ఇప్పటికే తెలంగాణలో ఉన్న జిల్లాల కలెక్టర్లను సైతం బదిలీ చేసింది.

 

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రాష్ట్రంలో ఉన్న గత ప్రభుత్వం అధికారులను మారుస్తు.. పాలన ప్రక్షాళన చేస్తుంది. కాగా ఇప్పటికే తెలంగాణలో ఉన్న జిల్లాల కలెక్టర్లను సైతం బదిలీ చేసింది. తాజాగా 8 మంది ఐపీఎస్‌ల అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం 8 ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ సౌత్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీగా సుభాష్‌ ను నియమించారు. కొత్తగూడెం ఓఎస్‌డీగా పరితోష్‌ పంకజ్‌, ములుగు ఓఎస్‌డీగా మహేష్‌ బాబాసాహెబ్‌, గవర్నర్‌ ఓఎస్‌డీగా సిరిశెట్టి సంకీర్త్‌, భద్రాచలం ఏఎస్పీగా అంకిత్‌ కుమార్‌ ను నియమించారు.

హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా సుభాష్
కొత్తగూడెం OSDగా పరితోష్ పంకజ్
భద్రాచలం ఏఎస్పీగా అంకిత్ కుమార్
ములుగు OSDగా మహేశ్ బాబాసాహెబ్
గవర్నర్ OSDగా సిరిశెట్టి సంకీర్త్
భైంసా ఏఎస్పీగా అవినాశ్ కుమార్
ఏటూరు నాగారం ఏఎస్పీగా శివమ్ ఉపాధ్యాయ
వేములవాడ ఏఎస్పీగా శేషాద్రిని రెడ్డి