మహబూబాబాద్ జిల్లాకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి… రోడ్డు మార్గాన పురుషోత్తమయ్యగూడెం వద్దకు చేరుకుని ముంపు ప్రాంతాలను పరిశీలించారు. మరిపెడ మండలం సీతారాం తండా వద్ద వరదల్లో కొట్టుకుపోయిన రహదారి పరిశీలించారు. అనంతరం సీతారాంతండాలో వరద బాధితులతో మాట్లాడి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మహబూబాబాద్ కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష నిరవించారు రేవంత్.
మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇస్తామన్న ఆయన… అనంతరం సంచలన వ్యాఖ్యలు చేసారు. ఖమ్మంలో ఆక్రమణల కారణంగానే వరదలు వచ్చాయని అన్నారు. పువ్వాడ అజయ్ ఆక్రమించి ఆస్పత్రి కట్టారని, దానిపై మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడాలని డిమాండ్ చేసారు. ఆక్రమణల నుంచి తెలంగాణా ను విముక్తి చేస్తాం అన్నారు సిఎం. వరద బాధితులకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. రేవంత్ వ్యాఖ్యల ఆధారంగా చూస్తే ఆయన తర్వాతి టార్గెట్ ఖమ్మంలో ఆక్రమణలు అని తెలుస్తోంది.