ROJA DEFEAT : రోజాపై తిరుగుబాటు ! నగరిలో వాళ్ళంతా వ్యతిరేకమే..

ఏపీలోని నగరి (Nagari) అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి రోజాపై (Minister Roja) వ్యతిరేక పీక్ స్టేజ్ కి చేరింది. ఐదు మండలాల వైసీపీ అధ్యక్షులు ఆమెకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తామని అధిష్టానానికి అల్టిమేటమ్ ఇచ్చేశారు. మొన్నటిదాకా ఆమె సోదరుల ఆధిపత్యంపై తిరుగుబాటు చేస్తే... ఇప్పుడు రోజా భర్త డైరెక్టర్ సెల్వమణి పెత్తనాన్ని సహించలేకపోతున్నారు.

 

 

 

ఏపీలోని నగరి (Nagari) అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి రోజాపై (Minister Roja) వ్యతిరేక పీక్ స్టేజ్ కి చేరింది. ఐదు మండలాల వైసీపీ అధ్యక్షులు ఆమెకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తామని అధిష్టానానికి అల్టిమేటమ్ ఇచ్చేశారు. మొన్నటిదాకా ఆమె సోదరుల ఆధిపత్యంపై తిరుగుబాటు చేస్తే… ఇప్పుడు రోజా భర్త డైరెక్టర్ సెల్వమణి పెత్తనాన్ని సహించలేకపోతున్నారు. వైసీపీ లీడర్లపై ఆయన అవినీతి ఆరోపణలు చేస్తుండటంతో… అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. గతంలో రెండు సార్లు ఓట్లేసి గెలిపించిన తమిళ ఓటర్లు కూడా ఈసారి రివర్స్ అయ్యారు.

పొద్దున లేస్తే పవన్ కల్యాణ్ (Pawan Kalyan), చంద్రబాబు (Chandrababu) మీద ఫైర్ అయ్యే ఫైర్ బ్రాండ్ రోజా… అదే దూకుడును నగరిలో సొంత పార్టీ నేతలపైనా చూపించారు. దాంతో స్థానికంగా వైసీపీ లీడర్ల నుంచి వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోంది. వైసీపీ అధిష్టానం ఆ నియోజకవర్గంలో జరిపిన సర్వేలు కూడా రోజాకు వ్యతిరేకంగా వచ్చాయంటున్నారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ రోజా బొటా బొటీ మెజార్టీతోనే గెలిచారు. 2014లో వెయ్యి ఓట్లు, 2019లో రెండు వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. నగరి తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గం. దాంతో రోజా భర్త, డైరక్టర్ సెల్వమణి ప్రచారంతోనే తమిళిలు ఓట్లతోనే ఆ మాత్రం మెజారిటీ వచ్చిందని అంటున్నారు. ఈసారి వాల్ళ ఓట్లు కూడా రోజాకు పడే ఛాన్స్ లేదు. ఆమె రజనీకాంత్ ని విమర్శించడంపై తమిళులు ఆగ్రహంగా ఉన్నారు.

రెండు సార్లు నగరి నుంచి గెలిచిన రోజాకు నగరిలో వైసీపీ నేతల్లో ఐక్యత కలిసొచ్చింది. కానీ ఈసారి చాలామంది ఆమెకు వ్యతిరేకం అయ్యారు. మొన్నటిదాకా రోజా సోదరులు నగరి పాలిటిక్స్ లో జోక్యం చేసుకోవడంతో ఆ వ్యతిరేకత పీక్ స్టేజ్ కి చేరింది. చాలా ఆలస్యంగా గుర్తించిన రోజా… ప్రస్తుతం వాళ్ళని పక్కనబెట్టేశారు. ఇప్పుడామె భర్త సెల్వమణి వైసీపీ కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ మీటింగ్స్ లో అసమ్మతి నేతల మీద.. ఆయన అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. దాంతో వైసీపీ లీడర్లలో వ్యతిరేకత మరింత పెరిగింది. రోజాను వ్యతిరేకిస్తున్న వాళ్ళల్లో చాలామంది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులే. అందువల్ల రోజాకు నెక్ట్స్ టిక్కెట్ ఇస్తారన్న గ్యారంటీ కూడా లేదంటున్నారు వైసీపీ లీడర్లు. ఒక సెలబ్రిటీ హోదాలో… జగన్ ని ఒప్పించి టిక్కెట్ తెచ్చుకున్నా… టీడీపీకి చేతాలారా నగరి సీటును అప్పగించడమే అవుతుందని అంటున్నారు. మరి రోజాకు మళ్ళీ టిక్కెట్ ఇస్తారా… రెబల్ లీడర్లను బుజ్జగించే బాధ్యత పెద్దిరెడ్డికి అప్పజెబుతారా… జగన్ ఏం డెసిషన్ తీసుకుంటారన్నది చూడాలి.