AP Results, RGV : ఏపీ ఫలితాలపై ఆర్జీవీ మౌనం.. వైసీపీ ఓటమి ఖాయమని ఫిక్స్ అయ్యాడా?

ఏపీలో ఎన్నికల ముందు ఆర్జీవీ (RGV) చేసిన రచ్చ ఎవరూ మర్చిపోరు.. మర్చిపోలేరు కూడా ! చంద్రబాబు, టీడీపీ టార్గెట్‌గా సినిమాలు తీయడమే కాదు..

ఏపీలో ఎన్నికల ముందు ఆర్జీవీ (RGV) చేసిన రచ్చ ఎవరూ మర్చిపోరు.. మర్చిపోలేరు కూడా ! చంద్రబాబు, టీడీపీ టార్గెట్‌గా సినిమాలు తీయడమే కాదు.. ట్వీట్లు వేయడం, కామెంట్లు చేయడం.. అంటించుకోని వివాదం లేదు ఒకరకంగా ! వ్యూహం సినిమాతో టీడీపీ బ్యాచ్‌ను ఆర్జీవీ పెట్టిన టెన్షన్ అంతా ఇంతా కాదు. కోర్టుల చుట్టూ తిరిగింది ఈ మూవీ వ్యవహారం. ఇక పవన్ కల్యాణ్‌ అంటేనే రెడ్‌బుల్‌ తాగినట్లు రెచ్చిపోయే వర్మ.. టీడీపీ, జనసేన పొత్తుల మీద, సేనాని తీరు మీద ఘాటు విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో ఆర్జీవీ పోస్టింగ్‌లకు వైసీపీ విపరతీమైన ప్రచారం కల్పించేది.

దీంతో వైసీపీ అనధికారిక స్టార్ క్యాంపెయినర్లలో ఒకరిగా ఆర్జీవీకి పేరు పడిపోయింది. ఏపీలో పోలింగ్ ముగిసింది. రికార్డు స్థాయిలో నమోదయిన పోలింగ్ పర్సంటేజీ.. ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే చర్చ జరుగుతోంది. ఏపీలోనే కాదు.. అక్కడి ఫలితాలపై తెలంగాణలోనూ జోరుగా చర్చ నడుస్తోంది. రాజకీయంగా ఏ చిన్న అప్డేట్ ఉన్నా.. సోషల్‌ మీడియాలో రియాక్ట్ అయ్యే వర్మ.. ఇప్పుడు మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. వైసీపీకి ఫేవర్‌గానో, టీడీపీకి వ్యతిరేకంగానో.. ఏ కామెంట్‌ చేయడం లేదు. ఇదే ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతోంది. నిజానికి ఎన్నికలకు వారం రోజుల ముందు నుంచే.. ఆర్జీవీ పొలిటికల్ ట్వీట్లు ఆపేశారు. సినిమాల ప్రమోషన్ల కోసం మాత్రమే.. ఆయన ట్విట్టర్‌ వాడుతున్నాడు. విమర్శలు, ప్రతి విమర్శలు, వైసీపీ ఎలివేషన్లు.. దాదాపు మాయం అయిపోయాయ్.

చివరిగా షర్మిల విషయంలో మాత్రమే కౌంటర్‌లు ఇచ్చారు వర్మ. ఎన్నికల రోజు కూడా.. తెలుగు రాష్ట్రాల ఓటర్లకు ఎలాంటి పిలుపునివ్వలేదు. కనీసం ఆరోజు ఒక్క ట్వీట్ కూడా వేయలేదు. ఐతే ఆర్జీవీ మౌనంపై.. టీడీపీ సోషల్ మీడియా రెచ్చిపోతోంది. వైసీపీ ఓటమి ఖాయమని.. వర్మకు అర్థమైందని.. అందుకే మౌనంగా ఉన్నారని అంటోంది. ఐతే టీడీపీ ఇంతలా రెచ్చగొడుతున్నా.. వర్మ మాత్రం రియాక్ట్ కావడం లేదు. కొందరి మౌనాన్ని కూడా భరించలేం.. అలాంటి వారిలో ఆర్జీవీ ఫస్ట్ వరుసలో ఉంటారు. మరి ఓవరాల్‌ పాలిటిక్స్ మీద వర్మ.. ఎలాంటి బాంబ్ పేలుస్తారో మరి.