అతనో వారియర్.. పంత్ పై ప్రశంసల జల్లు

సరిగ్గా ఏడాదిన్నర క్రితం అతని కెరీర్ లో అనూహ్య ప్రమాదం.. ఘోరమైన కారు యాక్సిడెంట్ లో చావు అంచుల వరకూ వెళ్ళిన పరిస్థితి... దాదాపు 15 నెలల బెడ్ కే పరిమితం.. కెరీర్ ముగిసినట్టేనని అంచనాలు...

  • Written By:
  • Publish Date - September 21, 2024 / 01:26 PM IST

సరిగ్గా ఏడాదిన్నర క్రితం అతని కెరీర్ లో అనూహ్య ప్రమాదం.. ఘోరమైన కారు యాక్సిడెంట్ లో చావు అంచుల వరకూ వెళ్ళిన పరిస్థితి… దాదాపు 15 నెలల బెడ్ కే పరిమితం.. కెరీర్ ముగిసినట్టేనని అంచనాలు… కానీ అతను మాత్రం పట్టుదలతో ప్రయత్నించాడు…కోలుకున్న తర్వాత మళ్ళీ గ్రౌండ్ లో అడుగుపెట్టి రీఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. మొదట వైట్ బాల్ ఫార్మాట్ లోనూ, ఇప్పుడు రెడ్ బాల్ క్రికెట్ లోనూ అదరగొట్టి తాను గొప్ప పోరాటయోధుడినని నిరూపించుకున్నాడు. డాక్టర్లు కూడా ఊహించనంత వేగంగా కోలుకున్నాడు.అతను ఎవరో కాదు వికెట్ కీపర్ రిషబ్ పంత్… అసలు పంత్ మళ్ళీ క్రికెట్ ఆడతాడని ఎవ్వరూ అనుకోలేదు..

అనుకున్నా గతంలోలా ఫామ్ కొనసాగిస్తాడని మాత్రం ఊహించలేదు. పంత్ మాత్రం వారియర్ గా ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు. ఐపీఎల్ , తర్వాత వరల్డ్ కప్ లోనూ సత్తా చాటిన ఈ యువ వికెట్ కీపర్ ఇప్పుడు టెస్టుల్లోనూ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ ఆడాడు. యాక్సిడెంట్ కు ముందు బంగ్లాదేశ్ పైనే చివరి టెస్ట్ ఆడిన పంత్ ఇప్పుడు అదే జట్టుపై రీఎంట్రీ ఇచ్చాడు. 67 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన పంత్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గిల్ తో కలిసి సెంచరీతో కదంతొక్కి జట్టుకు భారీ ఆధిక్యాన్నందించాడు. పంత్ శతకం చూసిన ఫ్యాన్స్ అతనో గొప్ప వారియర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.