Robot rickshaws : పాత పనితో కొత్త అవతారం ఎత్తిన రోబో రిక్షావాలా..

రిక్షా మనందరికీ తెలుసు.. దాని పై ప్రయాణించనపట్టికి దాని ఉనికి మాత్రం భారత దేశంలో ఒక్కడో ఒక చోట మాత్రం దర్శనమిస్తు ఉంటాయి. చాలా కాలం వరకు అప్పుడెప్పుడో పశ్చిమ బెంగాల్ కలకత్తాలో రిక్షా లాక్కుంటూ వెళ్లే రిక్షావాలాలను చూశాం. ఇప్పుడు తగ్గిపోయింది అనుకోండి. ప్రస్తుతం అచ్చం రిక్షావాలా మాదిరిగా నడుస్తూ రిక్షాను లాగుతున్న రోబోను మీరు ఎప్పుడైన చూశారా.. ?

రోబో.. కృత్రిమ మనిషి అని చెప్పవచ్చు. రోబోలను ఇంత వరకు విదేశాల్లో వినియోగించే వారు. ల్యాబ్ లో, హాస్పిటల్ లో విద్యా స్థలతో రోబోలను వినియోగిస్తుంటారు. ఇప్పుడు భారతదేశంలో కూడా రోబోల వినియోగం పెరిగింది. పెద్ద పెద్ద ఎయిర్ పోర్టులో మనకు రోబోలు కనిపిస్తాయి. అంతే ఇటీవల హైదరాబాద్ లోని కొన్ని రెస్టారెంట్లలో ఫుడ్ సర్వ్ చేసే రోబోల కనివిందు చేస్తున్నాయి. కానీ ఈ రోబో మాత్రం పాతకాలం పనితో కొత్త ప్రవర్తిస్తుంది ఈ సురత్ లో ఉన్న రోబో. మరీ అదేంటో ఒక లుక్ వేయండి.

రిక్షా మనందరికీ తెలుసు.. దాని పై ప్రయాణించనపట్టికి దాని ఉనికి మాత్రం భారత దేశంలో ఒక్కడో ఒక చోట మాత్రం దర్శనమిస్తు ఉంటాయి. చాలా కాలం వరకు అప్పుడెప్పుడో పశ్చిమ బెంగాల్ కలకత్తాలో రిక్షా లాక్కుంటూ వెళ్లే రిక్షావాలాలను చూశాం. ఇప్పుడు తగ్గిపోయింది అనుకోండి. ప్రస్తుతం అచ్చం రిక్షావాలా మాదిరిగా నడుస్తూ రిక్షాను లాగుతున్న రోబోను మీరు ఎప్పుడైన చూశారా.. ఇది ఎక్కడో కాదు ప్రధాని మోదీ సొంత రాష్ట్రం అయిన గుజరాత్ లోని సూరత్ లో రిక్షా లాగుతూ ప్రజలు ముక్కున వేలేసుకునేలా చేసింది. ఈ రిక్షా రోబో. గుజరాత్ లోని సూరత్ కు చెందిన నలుగురు విద్యార్థులు ఈ రకమైన రోబోను తయారు చేయాలని సంకల్పంతో 25 రోజులు శ్రమించి, రూ.30 వేల వెచ్చించి ఈ వినత్నూ ప్రాజెక్టుకు టెక్నాలజీతో ప్రాణాం పోశారు. పూర్తిగా బ్యాటరీతో ఈ రోబో రిక్షావాలా పని చేస్తాడు.

ఆటోమేటిక్ రోబో రిక్షావాలా..

ఈ రోబో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ తో తయారు చేయబడింది. పూర్తిగా ఆటోమేటిక్‌. మనం ఏం చెబితే దాన్ని బట్టి.. రెస్పాండ్‌ అవుతుంది. ఈ రోబోను మనం మొబైల్‌ సాయంతో కూడా కంట్రోల్‌ చేయొచ్చు. మనంమనం ఏదైనా చోటుకి వెళ్లాలని చెబితే.. ఫోన్ లో మెసేజ్ పెడితే చాలు.. వెంటనే చెప్పిన స్థలానికి వెళ్లి వస్తుంది. వస్తువలు తీసుక రావడం గానీ.. ఆటోమేటిక్‌గా ఆ చోటుకు వెళ్లి వస్తువులు డెలివరీ చేస్తుంది. దాని లోపల మొత్తం మ్యాపింగ్‌ ఉంటుంది. ఈ రిక్షా రోబో వాలా పూర్తిగా బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది.

కూలి రోబోకి మరింత సమయం పడుతుంది..!

ఈ రోబో తయారీ లో ముఖ్య భూమిక పోషించిన మౌర్య శివమ్ ఈ రోబో నమూన మాత్రమేనని.. దీన్ని పూర్తిగా అభివృద్ధి చేయాల్సి ఉంది. మనిషి ఎలా నడుస్తాడు? అన్న దానిపై అధ్యయనం చేసి ఈ రోబోను సృష్టించాము. టెస్టింగ్‌ ట్రయల్స్‌ కోసం రోడ్డుపైకి తీసుకువచ్చాము. ఈ రిక్షావాలా రోబో నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. సోషల్‌ మీడియాలో రిక్షా రోబో వీడియో తెగ వైరల్‌ కావడంతో దాన్ని తయారు చేసిన విద్యార్థులపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది.

S.SURESH