పదేళ్ళుగా వెయిట్ చేస్తున్నా, ఫ్యాన్ కల నెరవేర్చిన రోహిత్

మన దేశంలో క్రికెటర్లకు ఉన్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే... కేవలం స్వదేశంలోనే కాదు టీమిండియా ఎక్కడ ఆడినా మన ఫ్యాన్స్ ఉంటూనే ఉంటారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోనూ భారత క్రికెటర్ల ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు.

  • Written By:
  • Publish Date - December 3, 2024 / 11:47 AM IST

మన దేశంలో క్రికెటర్లకు ఉన్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే… కేవలం స్వదేశంలోనే కాదు టీమిండియా ఎక్కడ ఆడినా మన ఫ్యాన్స్ ఉంటూనే ఉంటారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోనూ భారత క్రికెటర్ల ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. తాజాగా ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ తో మ్యాచ్ లో రోహిత్ కు అరుదైన అనుభవం ఎదురైంది. ఫ్యాన్స్ కు ఆటోగ్రాఫ్ లు ఇస్తుండగా.. ఓ అభిమాని రోహిత్ భాయ్ పదేళ్ళ నుంచి నీ ఆటోగ్రాఫ్ కోసం ఎదురుచూస్తున్నా.. ముంబై కా రాజా రోహిత్ అంటూ అరిచాడు. దీంతో నవ్వుకుంటూ రియాక్ట్ అయిన హిట్ మ్యాన్ అతని దగ్గరకెళ్ళి ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. భారత కెప్టెన్ ఆటోగ్రాఫ్ తో ఆ అభిమాని సంతోషానికి హద్దే లేకుండా పోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది.