భారత్ కు రోహిత్ టెన్షన్, హిట్ మ్యాన్ ఫామ్ లోకి వస్తాడా ?

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పింక్ బాల్ టెస్ట్ కోసం భారత ఓపెనింగ్ జోడీపై సందిగ్ధత కొనసాగుతుండగా... కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్ టీమ్ మేనేజ్ మెంట్ కు తలనొప్పిగా మారింది. గత 10 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో ఓపెనర్ గా రోహిత్ శర్మ కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు.

  • Written By:
  • Updated On - December 5, 2024 / 04:18 PM IST

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పింక్ బాల్ టెస్ట్ కోసం భారత ఓపెనింగ్ జోడీపై సందిగ్ధత కొనసాగుతుండగా… కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్ టీమ్ మేనేజ్ మెంట్ కు తలనొప్పిగా మారింది. గత 10 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో ఓపెనర్ గా రోహిత్ శర్మ కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు. ఇది కచ్చితంగా టీం మేనేజ్‌మెంట్‌కు ఆందోళన కలిగించే విషయమే. పెర్త్ వేదికగా జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో రోహిత్ ఆడలేదు. యశస్వి జైస్వాల్‌తో కలిసి ఓపెనర్‌ గా వచ్చిన కేఎల్ రాహుల్ మొదటి ఇన్నింగ్స్‌లో 26 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 77 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో సున్నాకి అవుటైన జైస్వాల్ రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులు చేసి రాహుల్‌తో కలిసి తొలి వికెట్‌కు 201 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీని తర్వాత ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో రోహిత్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఆ మ్యాచ్‌లోనూ మూడు పరుగులకే అవుట్ అయ్యాడు. అయితే ఈ మ్యాచ్ లో రోహిత్ మిడిల్ అర్దర్లో బ్యాటింగ్ చేశాడు.

రోహిత్ 2018-19 ఆస్ట్రేలియా టూర్‌లో మూడో మ్యాచ్‌లో 63 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆస్ట్రేలియాలో ఇప్పటికీ ఇదే అతని అత్యుత్తమ స్కోరు.టెస్టుల్లో రోహిత్ మిడిల్ ఆర్డర్‌లో ఆడడం అదే చివరిసారి. ఇప్పుడు కాన్‌బెర్రాలో జరిగిన మ్యాచ్‌లో యశస్వి, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ మరియు విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే రెండో టెస్టుకు గంభీర్ ఇదే బ్యాటింగ్ ఆర్దర్ ను సెట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. రోహిత్ గత ఐదేళ్లుగా టెస్టుల్లో ఓపెనింగ్స్ చేస్తున్నాడు. ఈ ఏడాది మార్చిలో ధర్మశాలలో సెంచరీ చేసిన అతను ఆ తర్వాత 10 ఇన్నింగ్స్‌ల్లో ఒక అర్ధ సెంచరీ మాత్రమే సాధించగలిగాడు.ఇక ఇప్పుడు యశస్వి, రాహుల్ మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పితే రోహిత్ మిడిల్ ఆర్డర్‌లో ఫిక్స్ అయిపోవచ్చు.

ఇదిలా ఉంంటే పింక్ బాల్‌తో విరాట్ కోహ్లీ మాత్రమే సౌకర్యంగా అనిపించాడు. గత మ్యాచ్‌లో సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ మినహా నెట్‌లో ఏ బ్యాట్స్‌మెన్ కూడా కంఫర్ట్ గా కనిపించలేదు. మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, నవదీప్ సైనీ, త్రోడౌన్ స్పెషలిస్టులు భారత బ్యాటర్లను చాలా ఇబ్బంది పెట్టారు. మ్యాచ్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగితే పెద్ద సమస్యే ఎదురవుతుంది. ఈవెనింగ్ టైమ్ లో పింక్ బాల్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. ప్రాక్టీస్ సెషన్‌లో భారత జట్టు సాయంత్రం ప్రాక్టీస్ చేసింది. పింక్ బాల్‌ను ట్విన్ లైట్‌లో ఆడేందుకు జట్టు సిద్ధమవుతున్నట్లు కనిపించింది. ఈ స్ట్రాటజీలో కనుక భారత బ్యాటర్లు సక్సెస్ అయితే మంచి స్కోర్ చేయొచ్చు. అటు రోహిత్ శర్మ కూడా పింక్ బాల్ ఛాలెంజ్ ను కాన్ఫిడెంట్ గా ఎదుర్కొంటే మాత్రం ఫామ్ లోకి వచ్చే ఛాన్సుంది.