బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్ లో బిజీగా ఉంది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం జట్టుతో వెళ్ళలేదు. తన భార్య రితిక రెండోసారి బిడ్డకు జన్మనిస్తుండడంతో తొలి టెస్టుకు దూరమయ్యాడు. అయినప్పటకీ రోహిత్ ముంబైలోనే ప్రాక్టీస్ చేస్తున్నాడు. రోహిత్ మూడో వారంలో జట్టుతో కలుస్తాడని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. దీని ప్రకారం తొలి టెస్టుతో పాటు రెండో టెస్టులో ఆడడంపైనా సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు రోహిత్ గురించి ఎలాంటి సమాచారం లేదంటూ ఇటీవల గంభీర్ చెప్పడం కూడా చర్చనీయాంశమైంది, రోహిత్ మిస్సయితే తొలి టెస్టుకు వైస్ కెప్టెన్ బూమ్రానే సారథిగా వ్యవహరిస్తాడని గంభీర్ స్పష్టం చేశాడు.