Rohith Sharma: ఆసియా కప్ లో రోహిత్ శర్మ శాసనాలు

కెప్టెన్ గా రోహిత్ శర్మ వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు.

  • Written By:
  • Publish Date - September 13, 2023 / 02:37 PM IST

ఆసియాకప్ వన్డే టోర్నీల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దుమ్మురేపుతున్నాడు. ఓటమెరుగని కెప్టెన్‌గా దూసుకెళ్తున్నాడు. 2018 ఆసియాకప్‌లో తొలిసారి భారత జట్టుకు సారథ్యం వహించిన రోహిత్ శర్మ.. తాజా టోర్నీ వరకు మొత్తం 9 మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు.ఇందులో 8 విజయాలు అందుకోగా ఒక్క మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. అది కూడా తాజా టోర్నీలోనే పాకిస్థాన్ మ్యాచ్‌ ఫలితం తేలలేదు. ఆసియాకప్‌లో భారత్‌కు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా ధోనీ 9 విజయాలతో అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

తాజా టోర్నీల్లో భారత్ ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్‌తో గురువారం చివరి సూపర్ మ్యాచ్ ఆడనున్న భారత్.. ఆదివారం ఫైనల్‌ ఆడనుంది. సూపర్ 4‌లో పాకిస్థాన్, శ్రీలంకపై భారీ విజయాన్నందుకు భారత్ ఇప్పటికే ఫైనల్ చేరుకున్న విషయం తెలిసిందే. ఇక తాజా టోర్నీలో రోహిత్ శర్మ మూడు హాఫ్ సెంచరీలతో 194 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. పాకిస్థాన్‌తో లీగ్ మ్యాచ్‌‌లో విఫలమైన రోహిత్.. ఆ తర్వాత నేపాల్, పాకిస్థాన్, శ్రీలకంతో జరిగిన మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు బాదాడు. శ్రీలంకతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో పాటు వన్డే క్రికెట్‌లో 10 వేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. అత్యంత వేగంగా ఈ ఘనతను అందుకున్న రెండో బ్యాటర్‌గా నిలిచాడు.