Rohit Vemula case : రోహిత్ వేముల కేసు సంచల విషాయాలు..

రోహిత్‌ వేముల.. ఈ పేరు గుర్తుందా.. 2016లో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో (Hyderabad Central University) రోహిత్‌ వేముల (Rohit Vemula) ఆత్మహత్య (Suicide) దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రాజకీయంగాను ఈ ఇన్సిడెంట్‌ ప్రకంపనలు రేపింది.

 

 

రోహిత్‌ వేముల.. ఈ పేరు గుర్తుందా.. 2016లో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో (Hyderabad Central University) రోహిత్‌ వేముల (Rohit Vemula) ఆత్మహత్య (Suicide) దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రాజకీయంగాను ఈ ఇన్సిడెంట్‌ ప్రకంపనలు రేపింది. దాదాపు 8 ఏళ్లుగా నడుస్తున్న ఈ కేసును ఎట్టకేలకు పోలీసులు క్లోజ్‌ చేశారు. రోహిత్‌ ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కాదని.. అసలు రోహిత్‌ దళితుడు అని చెప్పేందుకు ఎలాంటి సాక్ష్యాలు లేవంటూ కోర్టులో కేస్‌ క్లోజింగ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ కేసులో నిందితులుగా ఉన్న సికింద్రాబాద్‌ మాజీ ఎంపీ బండారు దత్తాత్రేయ(Bandaru Dattatreya), ఎమ్మెల్సీ రాంచందర్‌రావు(MLC Ramchander), యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ వైస్‌ ఛాన్సలర్‌ అప్పారావు, సెంట్రల్‌ మినిస్టర్‌ స్మృతి ఇరానీ మరికొందరు ఏబీవీపీ (ABVP) నేతలతో సహా ఈ కేసులోని నిందితులకు పోలీసులు రిలీఫ్ కల్పించినట్లు అయింది. పోలీసులు వేసిన పిటిషన్‌ లోవర్‌ కోర్టులో ఛాలెంజ్‌ చేసే అవకాశాన్ని హైకోర్ట్‌ రోహిత్‌ పేరెంట్స్‌కు ఇచ్చింది. కానీ పోలీసుల పిటిషన్‌పై రోహిత్‌ కుటుంబసభ్యులు షాక్ అవుతున్నారు. పోలీసుల వాదన అర్ధరహితంగా ఉందని అంటున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని ఎలా చెప్పాలో కూడా అర్థం కావడంలేదంటూ ఎమోషనల్‌ అవుతున్నారు. చూడాలి మరి ఈ కేసులో రోహిత్‌ పేరెంట్స్‌ ఎలాంటి స్టెప్‌ తీసుకుంటారో.