Rohit Vemula’s case : రోహిత్‌ వేముల కేసు క్లోజ్‌.. తుది రిపోర్టులో సంచలనాలు..

రోహిత్‌ వేముల (Rohit Vemula).. ఈ పేరు గుర్తుందా.. 2016లో ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. యూనివర్సిటీల్లో దళిత విద్యార్థులపై వివక్ష చూపుతున్నారని.. విద్యార్థులు ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (Hyderabad Central University) లో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోగా.. రాజకీయంగానూ ఇది ప్రకంపనలు రేపింది.

రోహిత్‌ వేముల (Rohit Vemula).. ఈ పేరు గుర్తుందా.. 2016లో ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. యూనివర్సిటీల్లో దళిత విద్యార్థులపై వివక్ష చూపుతున్నారని.. విద్యార్థులు ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (Hyderabad Central University) లో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోగా.. రాజకీయంగానూ ఇది ప్రకంపనలు రేపింది. ఐతే ఈ కేసు ఎట్టకేలకు క్లోజ్ చేశారు. తుది రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు.

రోహిత్ వేముల అసలు దళితుడు కాదని.. అతడి అసలు కులం బయటపడుతుందోనన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. అందుకే ఈ కేసును క్లోజ్ చేస్తున్నామని తెలంగాణ హైకోర్టులో పోలీసులు కేసు క్లోజింగ్ పిటిషన్ దాఖలు చేశారు. రోహిత్ కుటుంబానికి చెందిన కుల ధృవీకరణ పత్రాలను ఫోర్జరీ చేశారని.. రోహిత్ దళితుడని చెప్పేందుకు ఆధారాలు లేకపోవడంతో కేసును మూసివేస్తున్నామని పోలీసులు అన్నారు. పోలీసుల పిటిషన్‌పై దిగువ స్థాయి కోర్టులో అప్పీలు చేసుకోవచ్చని రోహిత్ కుటుంబానికి హైకోర్టు సూచించింది.

దీంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న సికింద్రాబాద్‌ మాజీ ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ వైస్‌ ఛాన్సలర్‌ అప్పారావు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో పాటు పలువురు ఏబీవీపీ నేతలు సహా ఈ కేసులో నిందితులకు పోలీసులు రిలీఫ్ కల్పించినట్లు అయింది. పోలీసుల పిటిషన్‌పై రోహిత్‌ కుటుంబసభ్యులు షాక్ అవుతున్నారు. పోలీసుల వాదన అర్ధరహితంగా ఉందని అంటున్నారు. తన భావాలను ఎలా వ్యక్తీకరించాలో అర్థం కావడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.