వారిద్దరినీ రిటైర్ చేసేసిన రోహిత్, సారీ చెప్పిన భారత కెప్టెన్

అశ్విన్ రిటైర్మెంట్ తో భారత క్రికెట్ జట్టులో ఒక్కసారి పలువురు సీనియర్ ప్లేయర్స్ వీడ్కోలు గురించి చర్చ మొదలైంది. తర్వాత లిస్టులో ఎవరున్నారంటూ రిపోర్టర్లు పరోక్షంగా రోహిత్ ను ప్రశ్నించారు.

  • Written By:
  • Publish Date - December 19, 2024 / 12:09 PM IST

అశ్విన్ రిటైర్మెంట్ తో భారత క్రికెట్ జట్టులో ఒక్కసారి పలువురు సీనియర్ ప్లేయర్స్ వీడ్కోలు గురించి చర్చ మొదలైంది. తర్వాత లిస్టులో ఎవరున్నారంటూ రిపోర్టర్లు పరోక్షంగా రోహిత్ ను ప్రశ్నించారు. ఈ సిరీస్ మధ్యలో ఇంకా ఏమైరా సర్ ప్రైజులు ఉన్నాయా అంటూ అడగ్గా…ఇంకేమీ లేవంటూ హిట్ మ్యాన్ చెప్పాడు. అయితే గబ్బా టెస్ట్ ముగిసిన తర్వాత అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటనతో ఇప్పుడు అంద‌రి దృష్టి టెస్టు స్పెష‌లిస్టులు ఛ‌తేశ్వ‌ర పుజారా, అజింక్యా ర‌హానెల‌పై ప‌డింది. ఈ ఇద్ద‌రూ స్టార్ ఆట‌గాళ్లు భార‌త జ‌ట్టుకు ఆడి దాదాపు ఏడాదికి పైగా కావొస్తుంది. యువ ఆట‌గాళ్లు రిష‌బ్ పంత్, స‌ర్ఫ‌రాజ్ ఖాన్, శుభ్‌మ‌న్ గిల్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ వంటి ఆట‌గాళ్లు సుదీర్ఘ ఫార్మాట్ల‌ల‌లో స‌త్తా చాటుతుండ‌డంతో సెల‌క్ట‌ర్లు వీరి వైపు చూడ‌డం లేదు.

అయితే మీడియా సమావేశంలో పుజారా, రహానేలపై రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. వారిద్దరూ అంతర్జాతీయ క్రికెట్ కు ఇంకా వీడ్కోలు పలకకపోయినా రోహిత్ మాత్రం రహానే,పుజారా రిటైరపోయారు కదా అంటూ చెప్పి నాలిక్కరుచుకున్నాడు. అశ్విన్‌, ర‌హానే, పుజారాల‌ను మ‌నం విభిన్న పాత్ర‌ల్లో చూడ‌బోతున్నామా అని ఈ సంద‌ర్భంగా విలేక‌రులు ప్ర‌శ్నించారు. ఈ క్ర‌మంలో రోహిత్ మాట్లాడుతూ.. అశ్విన్ నిర్ణ‌యాన్ని గౌర‌విస్తున్నామని, అత‌డు స్వ‌దేశానికి తిరిగి వెలుతున్న‌ట్లుగా చెప్పాడు. అదే స‌మ‌యంలో ర‌హానె, పుజారా గురించి మాట్లాడుతూ కాస్త క‌న్ఫూజ్ అయ్యాడు. ఈ ముగ్గురూ రిటైర్ అయ్యార‌ని చెప్పుకొచ్చాడు. వెంట‌నే తేరుకుని పుజారా, ర‌హానెలు ఇంకా రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించ‌లేదు అనే విష‌యాన్ని గుర్తు చేశాడు. దీంతో అక్క‌డ న‌వ్వులు విరిశాయి.

ర‌హానె, పుజారాలు ఇంకా క్రికెట్ ఆడుతున్నార‌న్నాడు. వారిద్ద‌రికి ఇంకా దారులు మూసుకుపోలేద‌న్నాడు. మంచి ప్ర‌ద‌ర్శ‌న‌లు చేస్తే జ‌ట్టులో చోటు ద‌క్కుతుంద‌న్నాడు. ఇదిలా ఉంటే భారత జట్టులో నయా వాల్ గా గుర్తింపున్న పుజారా చివరిసారిగా 2023 డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్ పై ఆడాడు. అటు రహానే కూడా గత ఏడాది విండీస్ పై చివరి టెస్ట్ ఆడాడు.