బెంగళూరు టెస్టులో భారత్ బ్యాటర్లు చేతులేత్తేశారు. కివీస్ పేసర్ల ధాటికి టీమిండియా కేవలం 46 పరుగులకే కుప్పకూలింది. అటు ఫీల్డింగ్ లోనూ తడబాటు కివీస్ ఆధిపత్యానికి కారణమైంది.న్యూజిలాండ్ ఓపెనర్ టామ్ లాథమ్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను కేఎల్ రాహుల్ నేలపాలు చేశాడు. అలర్ట్‌గా లేని కేఎల్ రాహుల్ కనీసం క్యాచ్ కోసం ప్రయత్నించలేదు. తన క్యాచ్ కాదంటూ రియాక్షన్ ఇచ్చాడు. కానీ రిప్లేలో రాహుల్ పట్టాల్సిన క్యాచ్ గానే తేలింది. సునాయస క్యాచ్‌ను నేలపాలు చేయడంతో రోహిత్ శర్మ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. గట్టిగా అరుస్తూ అసహనం వ్యక్తం చేశాడు. అటు నెటిజన్లు కూడా రాహుల్ గ్రౌండ్ లో ఫోకస్ పెట్టినట్టు కనిపించడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.