కెప్టెన్ గా రోహిత్ చెత్త రికార్డ్ పటౌడీ రికార్డు సమం

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త రికార్డ్ నమోదు చేశాడు. 55 ఏళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్‌లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో ఎక్కువ పరాజయాలు చవిచూసిన భారత కెప్టెన్‌గా నిలిచాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ పేరిట ఉన్న చెత్త రికార్డ్‌ను సమం చేశాడు.

  • Written By:
  • Publish Date - November 5, 2024 / 01:30 PM IST

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త రికార్డ్ నమోదు చేశాడు. 55 ఏళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్‌లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో ఎక్కువ పరాజయాలు చవిచూసిన భారత కెప్టెన్‌గా నిలిచాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ పేరిట ఉన్న చెత్త రికార్డ్‌ను సమం చేశాడు. 1969లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ సారథ్యంలోని భారత జట్టు ఒకే ఏడాది నాలుగు టెస్ట్‌ల్లో ఓటమిపాలైంది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా.. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఓటమిపాలైంది. తాజాగా న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో మూడు మ్యాచ్ ల్లోనూ ఓడిపోయింది. కెప్టెన్‌గా రోహిత్ శర్మ సొంతగడ్డపై ఇప్పటి వరకు 5 పరాజయాలు చవిచూశాడు. సొంతగడ్డపై అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న సారథుల్లో రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు.