PAKISTAN: పాక్‌లో అంతే.. పాక్ కూడా అంతే ! ప్రజాస్వామ్యం ఉన్నా లేన్నట్లు ఉండడం.. కావాలంటే పాతరేయడం అక్కడ కొత్తేం కాదు. అలాంటి దేశంలో ఇప్పుడు ఎన్నికలు జరిగాయ్. బాంబ్ పేలుళ్లు, భారీ హింస మధ్య పోలింగ్ ముగిసింది. ఫలితాలు కూడా వచ్చేశాయ్. ఏ పార్టీ కూడా మెజారిటీ సీట్లను గెలుచుకోలేదు. మొత్తం 265 స్థానాలకు ఎన్నికలు జరగగా.. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థులు 99 చోట్ల గెలుపొందారు.
KODI KATHI SRINU: జైల్లోనే డిగ్రీ పూర్తి చేసిన కోడి కత్తి శ్రీను..
పాకిస్తాన్ ముస్లిం లీగ్ 69 సీట్లు, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ 51 స్థానాలు గెలుచుకున్నాయ్. సంకీర్ణం ఖాయం. దీంతో ఎవరు ఎవరితో కలుస్తారు అన్న సంగతి ఎలా ఉన్నా.. పాక్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరిగాయ్. ఫిబ్రవరి 8న పోలింగ్ జరగగా.. పార్టీలు పోటీ పడి రిగ్గింగ్‌కు పాల్పడినట్లు క్లియర్‌గా అర్థం అవుతోంది. పేపర్ బ్యాలెట్ ఓటింగ్‌ను తమకు అనుకూలంగా మార్చుకుంటూ.. చేయకూడని చెత్త పనులన్నీ చేశారు అక్కడి నాయకులు. పాక్‌లో పోలింగ్ రోజు నాడు జరిగిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్ని ఓటర్ స్లిప్‌ల విజువల్స్.. డిబేట్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారాయ్. వాల్డ్ బెస్ట్ ఫుట్‌బాల్ ప్లేయర్లందరికీ పాకిస్తాన్‌లో ఓటు ఉన్నట్లు.. ఓటర్ స్లిప్పులు కనిపించాయ్.
క్రిస్టియానో రొనాల్డో, మెస్సీ, నెయిమర్, ఎంబాపె.. ఇలా చాలామంది ఫుట్‌బాల్ ప్లేయర్ల పేర్లతో ఓటర్ స్లిప్పులు ఉన్న విజువల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయ్. ఈ ఓటర్ స్లిప్పులు చాలు.. పాకిస్తాన్‌లో పోలింగ్ ఎలా జరిగిందో అని చెప్పడానికి అంటూ కామెంట్లు కనిపిస్తున్నాయ్. ఈ మాత్రం దానికి పోలింగ్.. ఓటింగ్.. ఎలక్షన్.. అవసరమంటావా భయ్యా అంటూ కామెంట్లు పెడుతున్నారు వీడియో చూసినవాళ్లంతా !