MLC KAVITHA: ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై.. రౌస్ ఎవెన్యూ కోర్టులో హాట్‌హాట్ వాదనలు జరిగాయ్. తన కొడుక్కి పరీక్షలు ఉండడంతో.. బెయిల్ ఇవ్వాలని కవిత కోర్టును విజ్ఞప్తి చేశారు. ఆమె తరపున లాయర్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఐతే కవితకు వ్యతిరేకంగా ఈడీ బలంగా వాదనలు వినిపించింది. కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని.. బెయిల్ ఇవ్వొద్దని ఈడీ వాదించింది.
Boy In Borewell: ప్రాణం కాపాడారు.. బోరుబావి నుంచి సేఫ్‌గా సాత్విక్ రెస్క్యూ..!
విచారణ సందర్భంగా కవితపై సంచలన ఆరోపణలు చేసింది ఈడీ. కవితకు వ్యతిరేకంగా చాలా ఆధారాలు ఉన్నాయని.. ఢిల్లీ కుంభకోణానికి కవితే ప్రణాళిక రచించారని ఈడీ తరపున లాయర్ కోర్టుకు చెప్పారు. కవిత తన ఫోన్ డేటాను డిలీట్ చేయడంతో పాటు.. దర్యాప్తులో అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదని చెప్పారు. కవిత తమకు 10ఫోన్లు ఇచ్చారని.. అన్నీ ఫార్మాట్ చేసే ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తాము నోటీసులు ఇచ్చిన తర్వాత.. 4ఫోన్లలో డేటాను కవిత పూర్తిగా డిలీట్ చేసినట్లు వివరించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు.. అప్రూవర్‌గా మారిన వారిని బెదిరించారని.. తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొద్దని వార్నింగ్ ఇచ్చినట్లు ఈడీ వాదించింది. తన కుమారుడికి పరీక్షలు ఉండడంతో బెయిల్ ఇవ్వాల్సిందిగా కవిత విజ్ఞప్తి చేశారని.. కానీ ఆమె కుమారుడికి ఇప్పటికే పలు పరీక్షలు పూర్తయినట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చింది ఈడీ.
కవిత చిన్న కుమారుడు ఒంటరి కాదని.. అతడికి సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారని స్పష్టం చేసింది. కవితకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వొద్దని వాదించింది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది. ఇక అటు ఏప్రిల్ 20న కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. మరి కోర్టుకు ఆమెకు బెయిల్ ఇస్తుందా లేదా అని ప్రతీ ఒక్కరిలో ఉత్కంఠ కనిపిస్తోంది.